Monday, December 23, 2024

2028 నాటికి రికార్డు స్థాయిలో అత్యధిక వేడి..

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: వచ్చే ఐదేళ్లలో 2028 నాటికి ఏదో ఒక సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుకెక్కుతుందని, మిగతా మూడు సంవత్సరాల్లోని రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కీలకమైన భూతాప పరిధి 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ స్థాయి దాటే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా అంచనా వేసింది. ప్రపంచ వార్షిక వాతావరణ నివేదిక నుంచి దశాబ్ద వాతావరణ నివేదికగా సవరించిన ఈ తాజా నివేదిక జీరో స్థాయికి హరితవాయువుల వెల్లువను తగ్గించలేకుంటే అసాధారణ వేడి రికార్డుస్థాయిల్లో పెరిగిపోయి దశాబ్దకాలం మించి పీడిస్తుందని హెచ్చరించింది.

రికార్డు స్థాయిలో వేడి పెరగడం అనివార్యమౌతుందని పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో కనీసం ఒక సంవత్సరమైనా 98 శాతం అత్యధిక స్థాయి వేడి సంవత్సరంగా రికార్డు కెక్కుతుంది. అలాగే ఏదో ఒకసంవత్సరం 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ స్థాయి పరిధి దాటే అవకాశం 66 శాతం వరకు ఉంటుంది. వచ్చే ఐదేళ్లలో సరాసరి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల పరిధి దాటే అవకాశం 32 శాతం ఉంటుంది.

భూతాపం జీరోస్థాయికి చేరుకునే సమయంలో 2015 నుంచి తాత్కాలికంగా 1.5 డిగ్రీలసెంటిగ్రేడ్ పరిధి మించే అవకాశం పెరుగుతూనే ఉంది. 2015 నుంచి 2021 మధ్య కాలంలో 10 శాతం అవకాశం ఏర్పడింది. వాతావరణంపై మానవ కల్పిత ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి అనూహ్యంగా పెరిగిపోతున్నాయని వాతావరణ సంస్థ నివేదిక సూచించింది. దీనికి ఎల్‌నినో తోడుకావడం మరీ అధ్యాన్నంగా తయారౌతోందని హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News