లండన్: గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచ సంపద మూడింతలు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాను పక్కకు నెట్టేసి చైనా సంపదలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోడానికి పోటీపడడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని మేకిన్సీ అండ కో కన్సల్టెంట్స్ పరిశోధన విభాగం తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆదాయంలో 60 శాతం కన్నా ఎక్కువ ఉన్న 10 దేశాల జాతీయ బ్యాలెన్స్ షీట్లను ఆ పరిశోధన సంస్థ పరిశీలించింది. 2000 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా నెట్‌వర్త్ 156 ట్రిలియన్ డాలర్లు ఉండగా, 2020లో అది 514 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో చైనా మూడింట ఒక వంతు సంపదను పెంచుకుంది. 2000లో చైనా నెట్‌వర్త్ 7 ట్రిలియన్ డాలర్లు ఉండగా, 2020 నాటికి 120 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అది కూడా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్లుటిఓ)లో చేరక ముందే. చైనా ఆర్థికవ్యవస్థ చాలా వేగంగా పురోగతి సాధిస్తోంది. అమెరికాలో ప్రాపర్టీ ధరలు పెరిగిపోవడంతో దాని ఆర్థిక వృద్ధి మందగించింది. అమెరికా నెట్ వర్త్ రెట్టింపయి 90 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండు వంతుల సంపదను కేవలం 10 శాతం సంపన్న కుటుంబాలే సొంతం చేసుకున్నాయి. ప్రపంచ నెట్‌వర్త్‌లో 68 శాతం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నట్లు మెకిన్సీ గణించింది. ఇక ప్రపంచ టాప్ నెట్‌వర్త్ దేశాలుగా చూసినప్పుడు చైనా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడెన్ ఉన్నాయి.
రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడింతలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -