Wednesday, November 13, 2024

గ్లాక్ పిస్టల్ రూపకర్త మృతి

- Advertisement -
- Advertisement -

ఒకసారి లోడ్ చేస్తే 18 రౌండ్లు కాల్చగలిగే గ్లాక్ పిస్టల్ ను రూపొందించిన గాస్టన్ గ్లాక్ మరణించారు. ఆయన వయసు 94 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా గ్లాక్ పిస్టల్ కు ఎంతో ఆదరణ ఉంది. అనేక దేశాలు తమ సైన్యానికి ఈ పిస్టల్ ను అందించాయి. ఆస్ట్రియాలోని బిలియనీర్లలో గ్లాక్ ఒకరు. ఆయన సంపద 1.1 బిలియన్లని ఫోర్బ్స్ అంచనా వేసింది.

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో గ్లాక్ 1929లో జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన గ్లాక్, కొంతకాలం పలు వ్యాపారాలు చేశారు. ఆ తర్వాత ఆస్ట్రియా సైనిక దళాలకోసం ఆయన రూపొందించిన పిస్టల్ బహుళ ఆదరణ పొందింది. అమెరికాలోనూ గ్లాక్ పిస్టల్ కు ఎంతో డిమాండ్ ఉంది. గ్లాక్ కు భార్య హెల్గా, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే గ్లాక్ తన భార్యనుంచి 2011లో విడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News