Monday, December 23, 2024

వైభవంగా బోనాల ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -
  • పోతురాజులతో స్టెప్పులేసిన జగ్గారెడ్డి

సదాశివపేట: ఆషాఢ మాసాన్నీ పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. మంగళవారం సదాశివపేటలో కౌండిన్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో దుర్గభవానీ మాత దేవాలయం వరకు సామూహికంగా తరలి వెళ్లారు. బోనాల ఉత్సవాలకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మళరెడ్డి హాజరై బోనాల ఉత్సవాల్లో పోతురాజుల విన్యాసాలకు జగ్గారెడ్డి స్టెప్పులేశారు. ఈ కార్యక్రమంలో కౌండిన్య కులస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News