Friday, November 15, 2024

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

- Advertisement -
- Advertisement -
Glorious Christmas celebrations 2021
చర్చీలకు పొటెత్తిన క్రైస్తవ సోదరులు
కరుణామయుడికి ప్రత్యేక ప్రార్థనలు
ప్రత్యేక వస్త్రధారణ, సెల్పీలతో ఆకట్టుకున్న యువత

హైదరాబాద్: శాంతి దూత ఏస్తుక్రీస్తు జన్మ దినోత్సమైన క్రిస్మస్ వేడుకులను నగర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా నరగంలోని పలు చర్చిలు సందండిగా మారాయి. నగరంలోని క్రిస్టియన్ సోదరులు తమకు అందుబాటులో ఉన్న వివిధ చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరుణామయుడైన ఏసు ప్రభును సందర్శించునేందుకు శనివారం తెల్లవారు జాము నుంచే క్రైస్తవ సోదరులు చర్చీలకు పొటేత్తడంతో ప్రధాన చర్చీలు పూర్తిగా కిటకిటలాడాయి. సికింద్రాబాద్ విక్టోరియా క్రిస్టియన్ సిటీ చర్చి, సెంచూరీ బాపిస్టు చర్చి, వెస్లీ చర్చి, మిలియం మెథాడిస్ట్ చర్చి, సెయింట్ థామస్ చర్చి, ఫెలోషిప్ చర్చి, వెస్ట్ మారెడ్‌పల్లిలోని సెయింట్ ఆడ్రోస్ వెంకటపురంలోని సెయింట్ ఆంటోనీ, తిరుమల్ గిరిలోని సెయిన్ మేరీ, ఆల్ సెయింట్, గ్యారీసన్ వెస్టీ, బొల్లారంలోని సెయింట్ జోసఫ్, హోళీ ట్రీనిటీ చర్చీ, పెరల్ సిటీ చర్చి. అబిడ్స్‌లోని సెయింట్ జార్జీ,సెంచూనరీమెథడిస్ట్ చర్చిలు, చాపల్ రోడ్డులోని మెథడిస్డ్ చర్చి, రాక్ చర్చి, సెన్ జోసఫ్ కాథెడర్ల్, ఎర్రగడ్డ సెయింట్ పాల్ తదితర చర్చిలకు క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కరణామయుడిని దర్శించుకుని ఆయనను స్తుతిస్తూ సామూహిక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రజల్లో శాంతి, సౌభ్రాతృత్వం, సేవా తర్పరత పెంచడానికీ జీసెస్ జీవితం స్ఫూర్తి దాయకమని పలు చర్చీల ఫాదర్లు ఉపదేశించారు. శుక్రవారం ఆర్ధరాత్రి నుంచే బాల ఏసు ప్రభుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతేకాకుండ పలువురు శాంతా క్లాజ్ వేషధారణలో పిల్లలకు ప్రత్యేక బహుమతులను అందజేశారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని నిర్వహకులు పలు చర్చిలను ప్రత్యేకంగా అలకరిచడంతో రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. చర్చి ప్రాంగణాలల్లో యువత ప్రత్యేక వస్త్ర ధారణతో సందడి చేశారు.చర్చిల ప్రాంగణంలో యువత సెల్ఫీలు దిగుతూ సందండి చేశారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని మంత్రులు, వివిధ పార్టీల నేతలు క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News