Tuesday, December 24, 2024

ఉన్మాదాన్ని ఉపేక్షించవద్దు

- Advertisement -
- Advertisement -

ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువులతో ఉండే విధంగా.. స్వతంత్ర దేశంగా మార్చేందుకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని అన్నారు. వారందరికీ సిఎం కెసిఆర్ శిరసు వంచి వినమ్రపూర్వకంగా జోహార్లు ఆర్పిస్తున్నానని, ఘన నివాళులర్పిస్తున్నానని కెసిఆర్ పేర్కొన్నారు.

వైభవంగా
ముగిసిన వజ్రోత్సవాలు

మేధావులు మౌనంగా ఉండడం సరికాదు స్వాతంత్ర
స్ఫూర్తిని ఈతరం పిల్లల్లో రగిలించడానికే వజ్రోత్స
వాలు ప్రపంచంలో అద్భుతమైన సహజ, ఖనిజ,
యువ సంపద మన సొంతం అయినా ఆశించిన
అభివృద్ధి సాధించలేదు స్వాతంత్య్ర ఫలాలు
అందలేదని పలు వర్గాల్లో ఈనాటికీ అసంతృప్తి కోటి
మందితో జాతీయ గీతాలాపన దేశానికే గర్వకారణం
గాంధీ సినిమాను 22లక్షల మంది పిల్లలు వీక్షించారు
వారిలో 10శాతం మంది గాంధీబాట పట్టినా దేశం
పురోగమిస్తాం గాంధీ మార్గంలోనే తెలంగాణసాధన
వజ్రోత్సవాల ముగింపు వేడుకలో సిఎం కెసిఆర్

విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని, అహింసా వాదాన్ని, ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతి యుత ఉద్యమాలతో జయించొచ్చని ప్రపంచ మానవాళికి సందేశం ఇచ్చిన మహ్మత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని. అటువంటి దేశంలో గాంధీ గురించి, ఆయన ఆచరణ గురించి, స్వాతంత్య్ర పోరాటంలో ఉజ్వలంగా వారు నిర్వహించిన పాత్ర గురించి ఈతరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. మహాత్ముడు విశ్వమానవుడు. కొందరు అల్పులు గాంధీ గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన గొప్పతనాన్ని యుఎన్‌ఒ వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించాయి.

విష సంస్కృతిని చూస్తూ ఊరుకుంటే దేశానికి ముప్పు

మనతెలంగాణ/హైదరాబాద్: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినా ఇప్పటికీ పేదల ఆశలు నెరవేరలేదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. అనేక వర్గాల ప్రజలు మా కు స్వాతం త్య్ర ఫలాలు అందడం లేద ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వాటిని విస్మరించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కొన్ని కుట్రలు జరుగుతున్నాయన్నారు. చూస్తూ మౌనం వహించడం సరైంది కాదని, అర్థమై కూడా అర్ధం కాన ట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదని పేర్కొన్నారు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్స వ ద్విసప్తాహం ముగింపు వేడుకలు ఎల్. బి.స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జ రిగాయి. ముగింపు ఉత్సవాల సందర్భం గా కెసిఆర్ గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం సిఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మం త్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, స త్యవతి రాథోడ్, మహమూద్ అలీ, గంగు ల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మ ల్లారెడ్డి, జగదీష్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇం ద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రు లు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లాలు, నగరం నుంచి ప్రజ లు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యా రు. ముందుగా ఎల్‌బి స్టేడియానికి చేరుకున్న సిఎం కెసిఆర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సి ఎం కెసిఆర్ మాట్లాడుతూ, అద్భుతమైన స హజ వనరులు, మానవ వనరులు ఉన్న ఈ దేశం అనుకున్న విధంగా పురోగమించడం లేదన్నారు. మన దేశంలో మన రాష్ట్రానిది ఒక ప్రత్యేకమైన స్థానమని సిఎం అన్నారు.

స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకు, యువకులకు విస్తృతంగా తెలియపరచాలనే ఉద్దేశంతో 15 రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని, అహింసా వాదాన్ని, ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించొచ్చని ప్రపంచ మానవాళికి సందేశం ఇచ్చిన మహ్మత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని అని పేర్కొన్నారు. అటువంటి దేశంలో గాంధీ గురించి, ఆయన ఆచరణ గురించి, స్వాతంత్య్ర పోరాటంలో ఉజ్వలంగా వారు నిర్వహించిన పాత్ర గురించి ఈతరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. మహాత్ముడు విశ్వమానవుడని వ్యాఖ్యానించారు. కొందరు అల్పులు గాంధీ గురించి నీచంగా మాట్లాడవవచ్చని అన్నారు. ఆయన గొప్పతనాన్ని యుఎన్‌ఒ వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించాయని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా ఏ దేశానికి వెళ్లిన ఇండియా అంటే..గాంధీ పుట్టిన దేశం వాళ్లుగా గౌరవిస్తారని, యూ ఆర్ గ్రేట్ అని పొగడ్తల వర్షం కురిపిస్తుంటారని అన్నారు. గాంధీ జీవిత విశేషాలు, విగ్రహాలు.. విదేశాల్లో ఉన్నాయంటే భారతదేశానికి గర్వకారణం అని పేర్కొన్నారు.

మహనీయుల త్యాగాలతోనే స్వేఛ్చావాయువులు పీల్చుతున్నాం

స్వాతంత్య్రం ఊరికే రాలేదని, ఎన్నో అమూల్యమైన త్యాగాలు, బలిదానాలు జరిగితేనే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని సిఎం కెసిఆర్ చెప్పారు. ప్రాణ, ఆస్తి త్యాగాలు, అమూల్యమైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బలిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వచ్చిందని, ఎందరో త్యాగాల ఫలితంగానే స్వేచ్ఛా భారతంలో స్వేఛ్చా వాయువులు పీలుస్తున్నాంమని అన్నారు. ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువులతో ఉండే విధంగా.. స్వతంత్ర దేశంగా మార్చేందుకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని అన్నారు. వారందరికీ సిఎం కెసిఆర్ శిరసు వంచి వినమ్రపూర్వకంగా జోహార్లు ఆర్పిస్తున్నానని, ఘన నివాళులర్పిస్తున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి లాంటివి వస్తుంటాయ్ .. పోతుంటాయ్ .. స్వాతంత్య్ర ఉజ్వలత్వం … 75 ఏళ్లుగా స్వతంత్ర భారతంలో జరుగుతున్న విషయాలను గుర్తుచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలని అన్నారు. ముఖ్యంగా యువకులు, మేధావులు, ఆలోచనాపరులు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు. ఈ క్రమంలోనే 15 రోజులపాటు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించుకున్నామని చెప్పారు. గ్రామాల్లో, పట్టణాల్లో స్వతంత్ర ఉద్యమంపై చర్చ జరిగిందని కెసిఆర్ పేర్కొన్నారు.

సామూహిక జాతీయ గీతాలాపన తెలంగాణకే గర్వకారణం

స్వాతంత్ర భారత వజోత్సవాల ప్రతి ఇంట్లో స్ఫూర్తి రగిలేలా 15 రోజులపాటు రోజుకో కార్యక్రమం నిర్వహించామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. కోటి మందితో సామూహిక జాతీయ గీతాలాపన తెలంగాణకే గర్వకారణమని పేర్కొన్నారు. ఏకకాలంలో అందరూ జాతీయ గీతాన్ని ఆలపించేలా ఏర్పాట్లు చేసిన పోలీసు యంత్రాన్ని సిఎం అభినందించారు. ట్రాఫిక్‌లో ఉన్నవాళ్లు సైతం సామూహిక గీతాలాపన సమయంలో అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారని అన్నారు. గాంధీ సినిమాను 22 లక్షల మంది పిల్లలు చూశారని,అందులో 10 శాతం మందికి స్ఫూర్తి కలిగినా ఈ దేశం బాగా పురోగమించడానికి వారి శక్తిసామర్థ్యాలు వినియోగిస్తారని నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఇటువంటి స్ఫూర్తి ముందు కూడా కొనసాగాలని చెప్పారు. గాంధీ మార్గంలో దేశం పురోగమించాలని ఆకాంక్షించారు. గాంధీ చూపిన మార్గంలో అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా స్వాతంత్ర భారత వజోత్సవాల కార్యక్రమాలు చాలా గొప్పగా నిర్వహించిన అందరికీ, అలరించిన కళాకారులకు సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఏకత్వంలో భిన్నత్వం చూపగలిగినవారే నిజమైన దేశభక్తులు : కేకే

ఏకత్వంలో భిన్నత్వం చూపగలిగినవారే నిజమైన దేశభక్తులని రాజ్యసభ సభ్యులు, స్వాతంత్ర భారత వజోత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు వ్యాఖ్యానించారు. దేశభక్తిని కొందరు తమ పేటెంట్‌గా భావిస్తూ, తమకు నచ్చని వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ ఫాసిస్ట్ పోకడలను, మన సిఎం కెసిఆర్, ఇతర ప్రజాస్వామ్యవాదులు గట్టిగా ఎదుర్కొంటున్నారని చెప్పారు.దీనిపై ప్రజలలో హర్షం వ్యక్తమవుతుందని తెలిపారు. ఈ ప్రగతిశీల శక్తులను ఏకం చేసే ప్రక్రియలో సిఎం కెసిఆర్‌ను దేశమంతా అభినందిస్తుందని అన్నారు.ఇటువంటి నాయకత్వాన్నే దేశం ఎదురుచూస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో వెనక్కి నెట్టివేయబడ్డ తెలంగాణ స్వాతంత్ర వజ్రోత్స వేళ తన అస్తిత్వాన్ని చాటుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలలో సుస్థిరస్థానాన్ని ఏర్పరుచుకున్నారని చెప్పారు.

రానున్న రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి చెంది, దేశానికి మార్గం చూపే రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని సిఎం కెసిఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారని అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది అదనంగా ఆసరా పెన్షన్లు, 75 మంది ఖైదీల విడుదల, ఆసుపత్రులకు అదనపు నిధుల మంజూరు చేశారని చెప్పారు. దీపాలంకరణతో నగరం ధగధగ మెరిసిపోయిందని, జిల్లాల్లో పండుగ వాతావరణ ఏర్పడిందని పేర్కొన్నారు. పక్షం రోజులపాటు ప్రజలు ముందే వచ్చిన దీపావళి జరుపుకున్నారని తెలిపారు. సామూహిత జాతీయ గీతాలాపన మరుపురాని అనుభూతిని కలిగించిందని చెప్పారు. వజ్రోత్సవాల వేళ స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకోవడంతో పాటు వారి స్పూర్తిని నింపుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరిగాయని తెలిపారు. ప్రజల్లో జాతీయభావం పెంచడంలో వజ్రోత్సవ వేడుకలు ఎంతో దోహదపడ్డాయని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదని చెప్పారు. సిఎం కెసిఆర్ సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతోనే ఇంత పెద్ద కార్యక్రమం విజయవంమైందని అన్నారు.

రాష్ట్ర ప్రజల్లో భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తి కలిగింది : సిఎస్ సోమేష్‌కుమార్

రాష్ట్ర ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నింపేందుకై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా రూపొందించి అమలు చేసిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సవ వేడుకల్లో తెలంగాణా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం, ప్రతీ విద్యార్థి, ఉద్యోగి, యువకులతోపాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ ఇంటి పండగలా భావించి మమేకమయ్యారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో సి.ఎస్ సోమేశ్ కుమార్ ద్వి సప్తాహ వేడుకల నివేదికను తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 546 సినిమా హాళ్లలో లో గాంధీ సినిమా ను చూపించడం ఒక చారిత్రకమని, ఈ సినిమాను దాదాపు 22.30 లక్షల మంది విద్యార్థులు చూశారని తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో గాంధీ సినిమాను విద్యార్థులకు చూపించడంపట్ల దేశంలోని అనేక రాష్ట్రాల అధికారులు తమకు ఫోన్ చేసి అడిగారని వెల్లడించారు. అన్ని మండల కేంద్రాలతోపాటు అన్ని నగరాలలో నిర్వహించిన 1462 ఫ్రీడమ్ రన్ లలో దాదాపు 5 లక్షల మంది పాల్గొన్నారని అన్నారు.

ఎంప్లాయిస్‌తో 13,605 ఫ్రీడమ్ ర్యాలీలు నిర్వహించగా వీటిలో18 లక్షల మంది పాల్గొన్నారని చెప్పారు. మన రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు లకు దాదాపు 1.20 కోట్ల జాతీయ పతాకాలను ఉచితంగా అందచేశామని, ప్రతీ ఇంటిపై ఎగురవేసిన ఈ జెండాలన్నీ మన రాష్ట్రంలోనే తయారు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన హరిత హారం 18,963 లొకేషన్ లలో 37,66,963 మొక్కలు నాటడం జరిగిందని పేర్కొన్నారు.అబిడ్స్‌లోని నెహ్రూ చౌరస్తాలో ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా పాల్గొని..ఈనెల 16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేసి జాతికి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చారని, ఇదే సమయానికి మొత్తం రాష్ట్రంలో 95 .23 లక్షలమంది సామూహిక గీతాలాపన చేశారని తెలిపారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో తెలిపే ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశామని, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు సంయుక్తంగా ఆగస్టు 21వ తేదీన గ్రేటర్ హైదరాబాద్‌లోని 75 పార్కుల్లో వజ్రోత్సవ సంగీత విభావరి నిర్వహించినట్టు సిఎస్ వివరించారు. సాంస్కృతిక శాఖ ద్వారా రవీంద్ర భారతిలో సాంసృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా యువత, విద్యార్థుల్లో భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తి కలిగిందని వివరించారు.

ఆకట్టుకున్నసాంస్కృతిక కార్యక్రమాలు

స్వతంత్ర భారత స్వర్ణోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్బంగా సోమవారం ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి. సంగీత నాటక అకాడమీ చైర్మన్ పద్మశ్రీ దీపిక రెడ్డి శిష్య బృందం భారత స్వాతంత్రోద్యమ ఘట్టాలను తెలిపే శాస్త్రీయ నృత్యం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఖవ్వాలి కళాకారులు వార్సీ బ్రదర్స్ ఖవ్వాలి, పద్మశ్రీ శంకర్ మహదేవన్ సంగీత విభావరిలు సభికులను ఆలరించాయి. ముందుగా ప్రారంభ కార్యక్రమంలో పద్మజా రెడ్డి శిష్య బృందం స్వాతంత్రోద్యమ పోరాట ఘట్టాలతో అద్భుతమైన నృత్య ప్రదర్శన చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం, బ్రిటీష్ అధికారి డల్హౌసీ అరాచకాలు, మొదటి సిపాయిల తిరుగుబాటు, తెలంగాణలో స్వతంత్ర ఉద్యమ పోరాటాలను తెలిపే సంఘటనలను తమ శాస్త్రీయ నృత్యంలో కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. జాతీయ స్థాయిలో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ గణేష్ స్తుతితో ప్రారంభించిన సంగీత విభావరిలో తెలుగు, హిందీ భాషలలో సూపర్ హిట్ పాటలను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా కళాకారులు, పర్యారవణ ప్రేమికుడు వనజీవి రామయ్య,కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్, పలువురు క్రీడాకారులు, ఇతర ప్రముఖులను ముఖ్యమంత్రి కెసిఆర్ సన్మానించారు.

కవాలి గానంతో దేశభక్తిని ప్రజ్వలింపజేసిన వార్సీ బ్రదర్స్

ప్రముఖ ఖవ్వాలి సోదరులు వార్సీ బ్రదర్స్ దేశభక్తి, జాతీయ సమైఖ్యతను చాటే కవ్వాల్స్ ఆలపించారు.వార్సీ బ్రదర్స్ తమ కవాలి గానంతో దేశభక్తిని ప్రజ్వలింప చేశారు. ఉర్దూ గీతమాలికతో వార్సీ బ్రదర్స్ సిఎం కెసిఆర్‌ను విశేషంగా ఆకట్టుకున్నారు. లహరారహాహై దేకో ఆకాశ్ పర్ తిరంగా అంటూ వార్సీ ట్రూప్ పాడిన కవాలి అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది. కవాలి ముగిసిన తర్వాత సిఎం కెసిఆర్ చివరలో తనదైన స్టయిల్లో వార్సి సోదరులకు సలాం కొట్టారు. లెహరాయియాహై తిరంగా అనే కవ్వాల్‌తో ప్రారంభించి, సారాజహాసే అచ్చా, హిందూ సీతా హమారా అనే పాటను కవ్వాల్ రూపంలో అద్భుతంగా ఆలపించి సభను ఉర్రూతలూగించారు. హిందూ, ముస్లీమ్, క్రిస్టియన్ భాయి భాయి అంటూ దేశ సమైక్యతను తెలిపే కవ్వాల్‌ను అద్భుతంగా ఆలపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News