Wednesday, January 22, 2025

ద.మ రైల్వే సమగ్రత వాకథాన్ పాల్గొన్న జిఎం అరుణ్ కుమార్ జైన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : నిఘా అవగాహన వారోత్సవంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే శనివారం సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్ ప్రాంగణంలో ‘సమగ్రత (ఇంటిగ్రిటీ) వాకథాన్‌’ను నిర్వహించింది. ఈ ర్యాలీ లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ , చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మల్ఖేడే, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లకు చెందిన డివిజన్ రైల్వే మేనేజర్లు , సీనియర్ రైల్వే అధికారులు, క్రీడాకారులు రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఘా ప్రాముఖ్యతపై అవగాహాన కల్పించేందుకు జిఎం అరుణ్ కుమార్ జైన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వాకథాన్‌లో రైల్వే అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం – ప్రజా జీవితంలో సమగ్రత నిస్వార్థతను పెంపొందించడానికి, అవినీతి ప్రతికూల ప్రభావాన్ని ప్రచారం చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడానికి అవినీతిని శూన్య స్థాయికి తీసుకురావడానికి దక్షిణ మధ్య రైల్వే నిబద్ధతను ఆయన వివరించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో అవినీతి ఒక పెద్ద లోపమని, దానిని నిర్మూలించాలని అన్నారు. అవినీతి నిర్మూలన మిషన్‌లో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని కోరారు. చిత్తశుద్ధిని జీవన విధానంగా మార్చుకోవాలని చుట్టుపక్కల వారికి కూడా అదే విలువలను నేర్పాలని సిబ్బందికి సూచించారు. ప్రజా జీవితంలో పారదర్శకత ముఖ్యమని అదేవిధంగా సామాన్యులకు మెరుగయిన సేవలను సాదించేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఎంతయైన ఉందన్నారు. కాగా ప్రస్తుత సంవత్సరం నిఘా అవగాహాన వారం నేపథ్యం అవినీతికి నో చెప్పండి, దేశానికి పునరంకితంకండి పేరిట దక్షిణ మధ్య రైల్వే – విజిలెన్స్ విభాగం అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాన్ని పాటిస్తోంది. ఈ ఏడు రోజుల వ్యవధిలో దక్షిణ మధ్య రైల్వే జోనల్ హెడ్‌క్వార్టర్స్, ఆరు డివిజన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ,గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్లలో కుడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జోన్ లోని అన్ని డివిజన్‌లతో పాటు మూడు ప్రధాన వర్క్ షాప్‌లు , ఫీల్ యూనిట్లలో కుడా అవినీతిని రూపుమాపడానికి రైల్వే సిబ్బందికి ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News