Sunday, December 22, 2024

వ్యాగన్ వర్క్‌షాప్‌లో జిఎం తనిఖీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శుక్రవారం రాయనపాడులోని వ్యాగన్ వర్క్‌షాప్‌లో వార్షిక తనిఖీని చేపట్టారు. ఈ తనిఖీల్లో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ జె.కె.జైన్, ఎస్.శ్రీనివాస్, చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్, రాయనపాడు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ విధి నిర్వహణలో హిందీ భాష వినియోగాన్ని, భాషపై అవగాహన కల్పించే లక్ష్యంతో హిందీ లైబ్రరీని జనరల్ మేనేజర్ ప్రారంభించారు.

అనంతరం ఎం అండ్ జి స్టోర్స్, స్ట్రిప్పింగ్ షాప్, బిసిఎంహెచ్‌ఎల్ డోర్స్ రిపేర్స్ సెక్షన్, కాంపోనెంట్ షాప్ జీరో బే – ఆర్ హెచ్ వ్యాగన్‌లను తనిఖీ చేశారు. అనంతరం బే-1 నుంచి 5, సిబిసి విభాగం, బోగీల దుకాణం, వీల్ షాపులను జిఎం తనిఖీ చేశారు. పరిపాలన భవనంలో ట్రేడ్ యూనియన్లతో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చని వాతావరణం కోసం మొక్కలు నాటారు. అనం తరం జనరల్ మేనేజర్ అధికారులతో పనితీరుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, వ్యాగన్ వర్క్‌షాప్ యొక్క తదుపరి అభివృద్ధి ప్రణాళికల గురించి చర్చించి అధికారులకు పలు సలహాలు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News