Saturday, January 11, 2025

‘స్వచ్ఛ రైల్’ పరిశుభ్రతలో పాల్గొన్న జిఎం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ‘స్వచ్ఛ రైల్’ పరిశుభ్రత కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జీ) అరుణ్ కుమార్ పాలుపంచుకున్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన స్వచ్ఛ రైల్ పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రయాణికులను, అధికారులను, సిబ్బందిని ఉత్తేజపరిచారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన ‘స్వచ్ఛ పక్వారా పక్షోత్సవాల పరిశుభ్రత’ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని దక్షిణమధ్య రైల్వే నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా, ఇతర సీనియర్ రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రైల్వే అధికారులు, సిబ్బంది, రైలు వినియోగదారులతో జిఎం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ట్రైన్ నెం. 17016 సికింద్రాబాద్ -టు భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో పరిశుభ్రతను జిఎం తనిఖీ చేశారు. జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం 1 నుంచి 10 వరకు నిర్వహించిన స్వచ్ఛ ర్యాలీకి నేతృత్వం వహించారు. పరిశుభత్ర ముఖ్యాంశాలను, వాటిపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే సిబ్బందిచే ప్రదర్శించిన వీధి నాటకాన్ని ఆయన తిలకించారు. అనంతరం జనరల్ మేనేజర్ పచ్చదనం. పర్యావరణ పరిరక్షణ ప్రోత్సాహకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాలుపంచుకున్నారు. స్టేషన్‌లో శుభ్రతకు వినియోగించే వివిధ పరిశుభ్రత యంత్ర పరికరాలను అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News