Friday, December 20, 2024

ఆగస్టు నుంచి జీమెయిల్ సర్వీసులు బంద్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మిలియన్ల మంది జీమెయిల్ సర్వీసును వినియోగిస్తున్నారు. అందులో చాలామంది రోజులో ఒకసారైన జీమెయిల్ ఓపెన్ చేయకుండా ఉండరు. అంతేకాదు.. చాలా కంపెనీలు గూగుల్ ఇమెయిల్ పాట్‌ఫామ్‌పైనే ఎక్కువగా పనిచేస్తుంటాయి. ఫ్రీలాన్సర్లు సైతం తమ వృత్తిపరమైన కమ్యూనికేషన్ల కోసం జీమెయిల్ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అలాంటి జీమెయిల్ సర్వీసు గూగుల్ పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించిందంటూ గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయనే విషయం తెలియగానే అనేక మంది జీమెయిల్ యూజర్లు ఆందోళన చెందారు.

దీనిపై స్పందించిన గూగుల్.. ఇందులో కొంత మాత్రమే నిజం ఉందని, జీమెయిల్ యూజర్లు భయపడాల్సిన అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు గూగుల్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించింది. జీమెయిల్ సర్వీసుల్లో ఒక ఫీచర్ మాత్రమే నిలిచిపోనుంది. ఆ ఫీచర్ ఇమెయిల్ ప్లాట్‌ఫామ్ ప్రాథమిక HTML వెర్షన్ అని స్పష్టం చేసింది. గత ఏడాది సెప్టెంబరులో దీన్ని కంపెనీ ధ్రువీకరించింది. జీమెయిల్ సర్వీసు అధికారికంగా నిలిచిపోనుందంటూ వైరల్ అయిన ఫొటోలో నిజం లేదని, ఇది పూర్తిగా ఫేక్ ఫొటో అని తేల్చేసింది. మీరు సాధారణ జీమెయిల్ యూజర్ అయితే చింతించాల్సిన పని లేదని గూగుల్ స్పష్టం చేసింది. జీమెయిల్‌కు సంబంధించి ఒక వివరణను కూడా గూగుల్ విడుదల చేసింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News