Monday, December 23, 2024

హైదరాబాద్‌ కొలంబో మధ్య ప్రత్యక్ష ఫ్లైట్ సేవలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి కొలంబోకు ప్రత్యక్ష విమాన సేవలను జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 11: 50 గంటలకు ఇండిగో ఫ్లైట్ 6ఇ1181 బయలుదేరింది. ఈ ఫ్లైట్ 1400 గంటలకు కొలంబో చేరుకుంటుంది. ఈ విస్తరణతో ఇండిగో ఇప్పుడు హైదరాబాద్ నుంచి 14 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సేవలను అందిస్తోంది. దక్షిణ, మధ్య భారతదేశంలో ఇదే అత్యధిక అంతర్జాతీయ కనెక్టివిటీగా నిలిచింది.

కార్యాచరణకు సిద్ధమైన జిఎంఆర్ హైదరాబాద్
వచ్చే 2030 నాటికి భారతదేశం నాలుగో అతిపెద్ద ప్రపంచ ప్రయాణ వ్యయందారుగా మారుతుందని, అదే సంవత్సరం నాటికి 5 బిలియన్ ట్రిప్పులను పూర్తి చేస్తుందని అంచనా. విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో భారత్‌లోనూ, విదేశాల్లోనూ కొత్త మార్గాల అభివృద్ధి పెరుగుతోంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 34 మిలియన్లకు పైగా ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి దశల వారీగా విస్తరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కార్యాచరణలో ఉన్న ప్యాసింజర్ టెర్మినల్ 2,17,664 చదరపు మీటర్లు (23.42 లక్షల చదరపు అడుగులు) ఉంది.

దశలవారీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పునరుద్ధరించిన ప్యాసింజర్ టెర్మినల్‌ను ఆవిష్కరించింది. ఈ మెరుగైన టెర్మినల్ ఇప్పుడు అదనపు చెక్-ఇన్ కౌంటర్లు, సెక్యూరిటీ-స్క్రీనింగ్ యంత్రాలు, ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను కలిగి ఉంది. నేచురల్ లొకేషన్ అడ్వాంటేజ్, మల్టీ మోడల్ కనెక్టివిటీతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తృతమైన రూట్ నెట్‌వర్క్, ప్రయాణికులకు విమానయాన సంస్థల ఎంపికతో దక్షిణ, మధ్య భారతదేశంలో ‘గేట్వే ఆఫ్ చాయిస్’గా స్థిరపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News