Thursday, December 19, 2024

‘బాహుబలి3’ ఉంది.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్‌..

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చి ‘బాహుబలి 1, 2’ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. తొలిసారి ఒక ఇండియన్ మూవీ రూ.వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘బాహుబలి 2’ నిలిచింది. ఈ క్రమంలో ‘బాహుబలి 3’ ఉంటుందని పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి.

తాజాగా ‘బాహుబలి3’పై అప్డేట్ వచ్చింది. అయితే, ఆ మూవీ మేకర్స్ నుంచి కాదు.. ‘కంగువా’ నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. “వారం క్రితమే ‘బాహుబలి’ మేకర్స్‌ను కలిశాను. వాళ్ల లైనప్‌లో ‘బాహుబలి3’ ఉంది” అని జ్ఞానవేల్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News