Saturday, April 5, 2025

హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  జిఓ 111 ఎత్తివేతతో హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం కాబోతుందన్న చర్చ జోరందుకుంది. ఈ జిఓ పరిధిలో మొత్తం 84 గ్రామాలుండగా మొత్తం 1,32,600 ఎకరాల భూములున్నాయి. దీంతోపాటు ఈ జీఓ పరిధిలో 31,483 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 584 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ 84 గ్రామాలు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్‌ను తలదన్నేలా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

దీంతోపాటు రానున్న రోజుల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా నివారించడంతో పాటు నిబంధనలు కఠినతంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రానున్న 50 సంవత్సరాల జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు కల్పించాలని, అందులో భాగంగానే మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని ప్రభుత్వం అధికారులను సమాయత్తం చేసినట్టుగా తెలిసింది. ఎస్‌టిపిలు, బఫర్‌జోన్‌లు, గ్రీన్ బెల్ట్‌లు, అప్రోచ్ రోడ్లకు 100 అడుగుల వెడల్పుతో పాటు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News