- Advertisement -
హైదరాబాద్: గాంధీ భవన్‌ను జీఓ 317 బాధితులు ముట్టడించారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. దీంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటలలో జీఓ 317 పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ హామీ ఇచ్చారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. సూపర్ న్యూమరి పోస్టులు సృష్టించి జీవో 317 బాధితులకు స్థానిక జిల్లాలకు పంపేల ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
- Advertisement -