Thursday, January 23, 2025

గో బ్యాక్ మోడీ…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణకు ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తూ కెబిఆర్ పార్క్ దగ్గర తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఎగరవేసి నిరసన తెలిపారు. గో బ్యాక్ మోడీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ ప్లకార్డులు ప్రదర్శించిడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ వ్యతిరేకి అని, తెలంగాణకు వచ్చే ప్రాజెక్టులు, పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అలిశెట్టి అరవింద్ మండిపడ్డారు. మోడీ ప్రాజెక్టులను జాతి అంకితం ఇవ్వడం ఆ తర్వాత వాటిని ఆదాని, అంబానీలకు కట్టబెట్టడం పరిపాటిగా మారిందని దుయ్యాబట్టారు. చేనేత పై విధించిన 5 శాతం జిఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని అరవింద్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తుందని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News