న్యూఢిల్లీ : రూ.1,013 కోట్లు సమీకరణ లక్షంగా దేశీయ బాటమ్‌వేర్ బ్రాండ్ గో ఫ్యాషన్ తొలి ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) 17న ప్రారంభం కానుంది. ఈ ఐపిఒ ఈనెల 22న ముగియనుంది. ఇష్యూ ధర శ్రేణి రూ.655 నుంచి రూ.690 మధ్య ఉంది. కనీసం 21 ఈక్విటీ షేర్లతో వినియోగదారులు తమ బిడ్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.125 కోట్ల విలువ కల్గిన ఈక్విటీ షేర్లను సంస్థ అందుబాటులోకి తెస్తోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో మహిళల బ్రాండెడ్ బాటమ్‌వేర్ మార్కెట్‌లో సంస్థ 8 శాతం వాటాను కల్గివుంది.
సెబీ వద్దకు వెరండా లెర్నింగ్ ‘ఐపిఒ’
రూ.200 కోట్లు సమీకరణ లక్షంగా వస్తున్న వెరండా లెర్నింగ్ సొల్యూషన్స్ తన ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) డ్రాఫ్ట్ పేపర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద సమర్పించింది. నగదు పరిశీలన కోసం రూ.50 కోట్ల విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రీ -ఐపిఒ ప్లేస్‌మెంట్ చేయవచ్చు. ఈ ప్రీ-ఐపిఓ ప్లేస్‌మెంట్ చేపట్టినట్లయితే, బిఆర్‌ఎల్‌ఎంతో సంప్రదించి షేర్ ధరను నిర్ణయిస్తారు.