Thursday, January 23, 2025

గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు రూ.10లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు శుక్రవారం డిజిసిఎ రూ.10లక్షల జరిమానా విధించింది. జనవరి 9న బెంగళూరు ఎయిర్‌పోర్టులో 55మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోవడంతో కలకలం రేగింది. దీనిపై డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డిజిసిఎ నోటీసులుకు బదులిచ్చిన గో ఫస్ట్ సమన్వయంలోపంతో సంఘటన జరిగిందని తెలిపింది.

టెర్మినల్ కోఆర్డినేటర్, కమర్షియల్ స్టాఫ్, క్రూ మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో విమానం ప్రయాణికులును వదిలి వెళ్లిపోయింది. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది వారి మధ్య స్పష్టత లేకపోవడం ప్రధాన కారణంగా గోఫస్ట్ పేర్కొంది. ఈనేపథ్యంలో గోఫస్ట్ తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని పేర్కొంటూ రూ.10లక్షల విధిస్తున్నట్లు డిజిసిఎ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News