Thursday, January 23, 2025

ఈ నెల 30 వరకు ‘గో ఫస్ట్’ విమాన సర్వీసులు రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ‘గో ఫస్ట్ ’ఈ నెల 30 దాకా తన మొత్తం విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది.ఇంతకు ముందు ఈ సంస్థ ఈ నెల 28 వరకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నిర్వహణ సమస్యల కారణంగా ఈ నెల 30 వరకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలియజేయడానికి చింతిస్తున్నామని సంస్థ శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. టికెట్లు కొనుగోలుచేసిన వారికి మొత్తం సొమ్ము రిఫండ్ చేస్తామని కూడా సంస్థ తెలిపింది,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News