Saturday, January 11, 2025

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై జివో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తింపునిచ్చింది. సాంప్రదాయ స్త్రీమూర్తిగా, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో ఉన్న విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలుగులో ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించాలని జివోలో ప్రభుత్వం పేర్కొంది.

తెలంగాణ తల్లి విగ్రహం మన అస్తిత్వ, ఆత్మగౌరవానికి ప్రతీక అని, తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపడం నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో, సామాజిక మాధ్యమాల్లో, మాటల్లో, చేతల్లో అగౌరపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం వంటివి నేరంగా పరిగణించనున్నట్లు జివో స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News