మీడియాతో బిజెపి నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఇండోర్ : ఇంధన ధరలపై ప్రశ్నించిన మీడియా మిత్రులతో మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లండి.. అక్కడ చౌకగా పెట్రోల్ దొరుకుతుంది’ అంటూ మండిపడ్డారు. కట్నిలో ఓ కార్యక్రమానికి హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు రామ్ రతన్ పాయల్‌ని ఇంధన ధరలపై ప్రశిస్తే.. ‘తాలిబన్ పాలిత ప్రాంతానికి వెళ్ళండి. అక్కడ పెట్రోల్ రూ.50కే దొరుకుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు వివరణగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి దేశాన్ని అతలా కుతలం చేసిందని.. త్వరలో థర్డ్ వేవ్ రాబోతుందన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల బదులుగా కోవిడ్ మూడవ వేవ్ గురించి ఆలోచించాలని రిపోర్టర్‌కు సూచించారు. అయితే, ఈ కార్యక్రమంలో రామ్ రతన్ పాయల్, మరికొంతమంది బిజెపి కార్యకర్తలు ఎవరూ మాస్క్‌లు ధరించలేదు. ఇక బిజెపి నేత తీరుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.