Monday, December 23, 2024

ఇమ్రాన్ ఖాన్‌కు మర్యమ్ నవాజ్ ఝలక్!

- Advertisement -
- Advertisement -

Mariam Nawaz
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న మర్యమ్ నవాజ్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మాటల తూటాలతో ఝలక్ ఇచ్చింది. ఇండియాను అంతగా ప్రేమించేట్టయితే అక్కడికే వెళ్లిపో అంటూ సూచించింది. ఈ మర్యమ్ నవాజ్ ఎవరో కాదు పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు. ఇండియాను ‘నేషన్ విత్ ఏ గ్రేట్ సెన్స్ ఆఫ్ ఆనర్’ (గొప్ప గౌరవ భావంగల దేశం) అని ఇమ్రాన్ ఖాన్ పొగిడినందుకు ఆమె ఈ మాటల తూట పేల్చారు. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనేందుకు ముందు శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆ మాట అన్నారన్నది ఇక్కడ గమనార్హం. ఏదైనా అద్భుతం జరిగితేనే ఆయన తన పదవిలో మనగలుగుతారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇండియాకు అనుకూలంగా మాట్లాడారు. నాడు ఆయన మాట్లాడుతూ తానేమి భారత్‌కు వ్యతిరేకం కాదని, ఆ దేశాన్ని చాలా వరకు అనుసరిస్తున్నానన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ‘ ఏ దేశం కూడా భారత్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. ఏ దేశం ఇండియాను శాసించలేదు. ఇక్కడ పాకిస్థాన్ గురించి అవాకులు చవాకులు పేలే యూరొపియన్ యూనియన్ రాయబారులు ఇలాగే భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడగలరా?..అలా చేయలేరు ఎందుకంటే ఇండియా ఓ సార్వభౌమాధికార దేశం’ అని ఆయన అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన మర్యమ్ నవాజ్ ‘అతడికి పిచ్చెక్కింది. ఆయన పార్టీ వాళ్లే ఆయన్ని వదిలేసి వెళ్లినందుకు ఆయనకు పిచ్చిపట్టింది. ఒకవేళ మీకు(ఇమ్రాన్) ఇండియా అంటే అంత ఇష్టమైతే పాకిస్థాన్ వదిలేసి, ఇండియాకే వెళ్లిపొండి’ అంటూ మాటల తూటా పేల్చింది. భారత్‌ను ఇమ్రాన్ ఖాన్ పొగిడితే ఈ 48ఏళ్ల పిఎంఎల్‌ఎన్ పార్టీ అమ్మడికి ఉలుక్కెందుకో?…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News