Monday, December 23, 2024

ప్రజల్లోకి వెళ్లండి.. ప్రగతిని చాటండి

- Advertisement -
- Advertisement -
అమృత్ కాల్ వరకు సుదీర్ఘ లక్ష్యాల సాధన
కేబినెట్ భేటీలో ప్రధాని మోడీ దిశానిర్దేశం
మౌలిక సౌకర్యాల కల్పన నుంచి బడ్జెట్ కేటాయింపుల వరకు ప్రజంటేషన్

న్యూఢిల్లీ: ప్రజల్లోకి వెళ్లండి.. క్షేత్రస్థాయిలో ప్రగతిని వివరించండని ప్ర ధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు పిలుపునిచ్చారు. స్థానిక ప్రగతి మైదాన్‌లోని నూతన నిర్మిత కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని అధ్యక్షతన ఇం తకు ముందెన్నడూ లేని స్థాయిలో పూర్తిస్థాయి కేబినెట్ భేటీ జరిగింది. దీ నికి అన్ని స్థాయిల్లోని మంత్రులు హాజరయ్యారు. మూడు నాలుగు గంట ల పాటు జరిగిన సమావేశం కాగానే ప్రధాని మోడీ ఓ ట్వీటు వెలువరిం చారు. కేబినెట్ భేటీ చాలా ఫలప్రద దిశలో సాగిందని తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్లలో ప్రభుత్వం అన్ని రంగాలలో గణనీయ ప్రగతి సాధించిందని , అయితే దీనిని వాస్తవిక రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మం త్రులపై ఉందని ప్రధాని కోరారు. పనులు చేస్తూ ఉండాలి, చేసిన పనుల తో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ సాగాల్సిన బాధ్యత వచ్చే తొమ్మిదినెలల వరకూ మంత్రిమండలిలోని వారిపై ఉందని తెలిపారు. మంత్రుల మార్పు ఉంటుందని, కొన్ని రాష్ట్రాల బిజెపిల అధ్యక్షులను మా ర్చివేస్తారని ఈ కీలక భేటీపై ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం పలు రంగాలలో సాధించిన ప్రగతిని తెలిపే వీడియో ప్రదర్శనలు ఈ సమావేశంలో ప్రదర్శించారని సంబంధిత వర్గా లు తెలిపాయి. మౌలిక వ్యవస్థలు మొదలుకుని బడ్జెట్‌లో కేటాయింపుల వరకూ ఈ ప్రజెంటేషన్‌లో తెలియచేశారని వెల్లడైంది. 2047లో భారతదేశం స్వాతంత్య్ర శతజయంతిని నిర్వహించుకుంటుంది. అప్పటివరకూ వివిధ రంగాలకు ఖరారు చేసుకున్న లక్షాలను తెలిపిన తరువాత ప్రధాని మోడీ వీటి గురించి జనంలో తెలియచేయాల్సి ఉందని మంత్రులకు హితవు పలికారు. 2047 వరకూ దేశానికి అమృతకాల ఘడియలు అని , శత ఉత్సవాల తరువాత ఇక ఇండియా ప్రపంచంలోని అత్యంత ప్రగతియుత దేశాల సరసన చేరుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచ సవాళ్లు, విదేశీ పర్యటనల ప్రస్తావన
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పలు కీలక సవాళ్లను భేటీలో ప్రధా ని మోడీ ప్రస్తావించినట్లు తెలిసింది. కోవిడ్ ఆ తరువాత కొన్ని ప్రాంతా లలో తలెత్తిన అంతర్గత పోరువంటి పరిణామాలు, ఈ నడుమ ఇతర దేశాలు పలు సంక్లిష్టతలు ఎదుర్కొన్నా భారతదేశం అన్నింటిని అధిగ మించి ముందుకు దూసుకువెళ్లిందని ప్రధాని తెలిపారు. మంత్రివర్గ భేటీ దశలోనే వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన పలువురు సెక్రెటరీలు కీలక విషయాలను ప్రస్తావించారు. విదేశాంగ, రక్షణ కార్యదర్శులు ప్రత్యేకించి ప్రధాని మోడీ ఇటీవల జరిపిన అమెరికా పర్యటన అత్యంత జయప్రదం అయిందని వివరించారు. తరువాతి ఈజిప్టు పర్యటనలో కూడా గణనీయ చర్చలు జరిగాయని తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల అమలు ఏ విధంగా సముచిత రీతిలో చేపట్టాల్సి ఉందనేది కూడా విశ్లేషించారు. ప్రధాని మోడీ ఇక్కడి ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లోనే జి 20 భేటీ జరుగనుందని తెలిపారు. ఇప్పుడు జరిగిన భేటీ ప్రయోజనకరం , ప్రత్యేకించి బహుళ పాలసీ విషయాలపై అభిప్రాయాల వినిమయం జరిగిందని ప్రధాని ఆ తరువాత తమ ట్వీటులో భేటీ ఫలప్రదం అన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News