Sunday, December 22, 2024

చనిపోయిన రైతుల ఇళ్లకు వెళ్లి సెల్ఫీలు తీసుకోండి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నేతలకు చురక అంటించిన రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో చనిపోయిన రైతుల ఇళ్ళకు వెళ్ళి సెల్ఫీతీసుకోండని ఆ పార్టీ నేతలకు రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి చురక అంటిచారు.సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ శాషనసభా పక్ష నేత భట్టి విక్రమార్కను ఉద్దేశించి మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ రైతులకు మీరు ఉచితంగా కరెంటు ఇచ్చామని, ఇప్పుడు అసలు కరెంటు ఇవ్వడం లేదని అంటున్నారు కదా.. మరో సారి వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్ళినప్పుడు కరెంటు వైర్లను పట్టుకుని సెల్ఫీ దిగి పెట్టాలని ఎద్దేవాచేశారు.

కరెంటు ఇస్తున్నామో లేదో తెలుస్తోంది మీ పాలనలో ఇచ్చిన కరెంటు ఏపాటి నాణ్యమైనదో కూడా తెలుస్తుందన్నారు. మీరిచ్చిన అర్థరాత్రి కరెంటుకు, నాణ్యతలేని కరెంటుకు, రాత్రి పూట బావుల దగ్గరకు వెళ్లి కరెంటు షాకుతో, పాము కాటుతో బలైన రైతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి.. మీ కుటుంబాలు ఆగం కావడానికి కారణం మీరేనని ఒప్పుకుని వాళ్లకు క్షమాపణలు చెప్పి… వారితో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండని సలహా ఇచ్చారు. ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లో ఉన్న చెప్పుల ఫొటోలు, లాఠీచార్జీలతో గాయపడి రక్తమోడుతున్న రైతుల ఫొటోలు పట్టుకుని సెల్ఫీ దిగి, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోండన్నారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి మధ్యలోనే వదిలేసిన ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసి పెట్టండంటూ ఎద్దేవా చేశారు.ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో వందలాది మంది ఆత్మబలిదానాలకు మేమే కారణం.. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్ర ప్రకటనను ఆలస్యం చేశాం… ప్రజల అభీష్టానికి భిన్నంగా, రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకుని వేలాడి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాం, అమర వీరుల స్తూపం దగ్గర, తెలంగాణ అమరుల కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పి వారితో సెల్ఫీలు దిగాలన్నారు.

పోడు భూములపై హక్కులు అడిగినందుకు ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలను పొట్టన పెట్టుకున మీరు అక్కడివెళ్లి సెల్ఫీ తీసుకుని పెట్టాలన్నారు. మీరు రాష్ట్ర ప్రజలకు ఏ స్థాయిలో మంచినీటిని సరఫరా చేశారో.. ఒకసారి పాత పేపర్లు తిరగేసి చూడండి. లేకపోతే గూగుల్ ని అడిగి చూడండి. మీరు ఇచ్చిన నీటి గురించి పుంఖానుపుంఖాలుగా వివరిస్తుందన్నారు.మూడు గంటల కరెంటు చాలని మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే చెప్పాడు, ఉచిత కరెంటు వద్దని మీ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారని మీ అధికార ప్రతినిధి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.

మళ్లీ మీరు వచ్చి దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాలు నమ్మే పరిస్థితి లేదు. మీరు చేశామని చెప్పుకుంటున్న పనులకు ప్రత్యేకించి సెల్ఫీలు తీసుకోవాల్సిన పని లేదని,ఒకసారి పాత పేపర్లు తిరగేస్తే చాలా మీ చరిత్ర, మీ భండారం మొత్తం బయటపడుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News