Wednesday, January 22, 2025

ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సినిమా “111 గ్రీన్ జోన్”

- Advertisement -
- Advertisement -

సినిమా బండి క్రియేషన్స్, యుపిక్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “111 గ్రీన్ జోన్”. విజయ రాఘవేంద్ర దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్, పోస్టర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

‘రైతు భూమి ఉన్నంతవరకే రాజు. ఒక్కసారి ఆ భూమి అమ్ముకున్నామా.. అదే భూమికి కూలీలు అయిపోతాం’’ అనే వాయిస్ ఓవర్ తో మొదలైన టైటిల్ టీజర్ ఎక్స్ టార్డినరిగా వుంది. “111 గ్రీన్ జోన్” కథని ప్రజెంట్ చేసేలా చాలా ఎక్సయిటింగ్ గా  టీజర్ ని డిజైన్ చేశారు. టైటిల్ డిజైన్ , వీఎఫ్ ఎక్స్ వర్క్ బ్రిలియంట్ గా వుంది. లియాండర్ లీ నేపధ్యం సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

టైటిల్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు విజయ రాఘవేంద్ర మాట్లాడుతూ..111 గ్రీన్ జోన్ మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం. మంచి బడ్జెట్ వుంటే పాన్ ఇండియా రేంజ్ లో చేసే చిత్రమిది. ఎందుకంటే గ్రీన్ జోన్ అనేది మన దగ్గరే కాదు.. ఇండియా అంతా వుంది. ఈ మంచి సినిమాని ప్రేక్షుల్లోకి తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. మంచి టీం వర్క్ తో చేసిన చిత్రమిది. టీజర్ మీ అందరికీ నచ్చడం అనందంగా వుంది. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.

లియాండర్ లీ మాట్లాడుతూ.. దర్శకుడు విజయ రాఘవేంద్ర నాలుగేళ్ళుగా మంచి స్నేహితుడు. 111 గ్రీన్ జోన్ కంటెంట్ పరంగా చాలా స్పెషల్ మూవీ. కల్చర్ తో ముడిపడిన చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది’’ అన్నారు

వీఎఫ్ ఎక్స్ చందూ మాట్లాడుతూ.. దర్శకుడు విజయ రాఘవేంద్ర గారు చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు.  టీజర్ లో వినిపించిన డైలాగ్ లోని పెయిన్ తో ఈ మోషన్ టీజర్ చేశాం.  లీ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్’’ తెలిపారు.

చిత్రన్ మాట్లాడుతూ.. ఇది సమాజానికి ఉపయోగపడే సినిమా. చిన్న సినిమా అయినప్పటికీ ఇందులో వుండే కంటెంట్ చాలా పెద్దది. ఇందులో పాటని చాలా ప్రేరణ ఇస్తూ రాయించారు డైరెక్టర్. చంద్రబోస్ గారి పక్కన నా పేరు చూసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.’’ అన్నారు.

“111 గ్రీన్ జోన్” కోసం ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి లియాండర్ లీ సంగీతం సమకూరుస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ ఎడిటర్‌ ఎన్టీఆర్‌.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News