Monday, January 20, 2025

మద్యం దుకాణాలకు జిఒ 4 వర్తించదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో దుకాణాలు, ఎస్టాబ్లిష్‌మెంట్లు 24 గంటలూ తెరిచి ఉంచేందుకు వీలు కల్పించే ఉత్తర్వులు (జిఒ ఎంఎస్-4) ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖకు వర్తించవని ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల ప్రకారం నిర్దేశించిన సమయాల్లోనే టిఎస్ బిసిఎల్, ఐఎంఎఫ్‌ఎల్ డిపోలు, డిస్టలరీలు, బ్రివరీలు, ఎ4 షాపులు, 2బీ బార్లు తెరిచి ఉంటాయని పేర్కొంది. 24 గంటలపాటు దుకాణాలను తెరిచి ఉంచే విధానం దేశంలోని న్యూఢిల్లీ, ముంబయి, బెంగుళూరు తదితర మెట్రో నగరాల్లో అమలులో ఉందని, ప్రభుత్వం ఈ నెల 4న విడుదల చేసిన జిఒ ఎంఎస్- 4 తెలంగాణ రాష్ట్ర దుకాణాలు, ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్- 1988కి లోబడే ఉందని తెలిపింది. అంతేకాకుండా ఈ ఉత్తర్వులు అన్ని దుకాణాలకు యథావిధిగా వర్తించవని, ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News