Thursday, January 23, 2025

వినూత్న ప్రచారం.. ఓటర్లకు అఫిడవిట్ కాపీలు

- Advertisement -
- Advertisement -

Goa AAP Candidates Sign Affidavit given to Voters

పనాజి: విలక్షణ ఆలోచనలు, విభిన్న పోకడలతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తోంది. గోవా మెరుగైన భవిష్యత్తు కోసం తమ పార్టీకి ఓటు వేయాలని, బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలను ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కోరారు. ఇతర పార్టీల కార్యకర్తలు, ఆప్‌లో చేరేందుకు తమ పార్టీలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు, గోవా భవిష్యత్తు కోసం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు గుర్తుకు ఓటు వేయండి.. దయచేసి ఈసారి మీ పార్టీని మరచిపోండని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే నినజాయితీగా పనిచేస్తామని ఆప్ అభ్యర్థులతో అఫిడవిట్‌లపై కేజ్రీవాల్ సంతకాలు చేయించారు. అంతేకాదు గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించబోమని, ఆప్‌నకు విశ్వాసపాత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కేజ్రీవాల్ సమక్షంలో గోవా ముఖ్యమంత్రి అభ్యర్థి పాలేకర్ అభ్యర్థులందరితో ప్రమాణం చేయించారు.

Goa AAP Candidates Sign Affidavit given to Voters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News