Sunday, November 24, 2024

ఒళ్లు గగుర్పొడిచేలా 16 మంది మహిళలను చంపి…

- Advertisement -
- Advertisement -

పనాజి: ఓ వ్యక్తి పెళ్లి పేరుతో 15 సంవత్సరాలలో 16 మంది మహిళలను హత్య చేసిన సంఘటన గోవాలోని పనాజిలో జరిగింది. హత్య చేసిన అనంతరం ఆభరణాలను దొంగతనం చేసి జువెల్లరీ షాపులో అమ్మేవాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహానంద్ నాయక్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 1994లో ఖండే పార్ ప్రాంతంలో గులాబి గోయంకర్(30) మృతదేహం కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. గోయంకర్ ట్రైలర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పోలీసులు అప్పటికే మహానంద్ నాయక్‌పై అనుమానం ఉండడంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కానీ తోటి ఆటో డ్రైవర్లు హత్య జరిగిన రోజు ఆటో స్టాండ్‌లో ఉన్నాడని చెప్పడంతో మహానంద్‌ను పోలీసులు విడిచిపెట్టారు.

షిరోడా ప్రాంతంలో ధర్శన్ నాయక్(21) అనే యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది.  ధర్శన్ కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లగా ఆమె ఒంటరిగా పూరి గుడిసెలో నివసిస్తోంది. బంబోలిమ్ ప్రాంతంలో జీడి చెట్టుకు ఆమె ఉరేసుకుంది. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. శవ పరీక్షలో ఆమె ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేశారని తేలింది.

Also Read: ప్రగతి నగర్‌లో కారు భీభత్సం..

21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న అమ్మాయిలను మహానంద్ నాయక్ అనే రాక్షసుడు వలలో వేసుకొనేవాడు. అనంతరం వారితో ప్రేమగా నటిస్తూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి ఆభరణాలు, నగదు తీసుకొని పారిపోయేవాడు. గోయంకర్‌ను చంపిన తరువాత 15 మంది మహిళలను హత్య చేశాడు. 2005లో ముగ్గురు, 2006లో ఒకరు, 2007 ఐదుగురు, 2008లో ఇద్దరు, 2009లో ఒక మహిళను హత్య చేశాడు.

2009లో యోగితా నాయక్(30) అనే మహిళ కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె 23 ఏళ్ల మహిళతో ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తనని రేప్ చేసిన వ్యక్తి ఫోన్ వాడుతున్నట్టు తేలింది. గులాబీ కేసుతో 16 కేసులు లింక్ ఉండడంతో 2009లో మహానంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. తాను బిజినెస్ మ్యాన్ అని పేద మహిళలను మహానంద్ పరిచయం చేసుకునేవాడు. అనంతరం వారికి ఐస్‌క్రీములు ఇప్పించి తన మాయమాటలతో వలలో పడేసుకోవడంతో పాటు పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు. అనంతరం వారిని హత్య చేసి బంగారు ఆభరణాలతో పారిపోయేవాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహానంద్ భార్య కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. మహానంద్ ఇంటిపై మూక దాడి చేసి తగలబెట్టడంతో అతడి భార్యను పోలీసులు సురక్షిత ప్రదేశానికి తరలించారు. ప్రస్తుతం మహానంద్ వయసు 54 సంవత్సరాలు. 14 సంవత్సరాల నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News