- Advertisement -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై చర్చ
న్యూఢిల్లీ: రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితలు వెలువడిన నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంగళవారం నాడిక్కడ ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని, ప్రాంతీయ పార్టీల సాయంతో రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సావంత్ ధీమా వ్యక్తం చేశారు. గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగగా ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనున్నది. గోవాలో ఈ సారి బహుముఖ పోటీ చోటు చేసుకుంది. పోటీ ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్ మధ్య ఉన్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన-ఎన్‌సిపి కూటమి కూడా బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన బిజెపి అగ్రనేత మనోహర్ పారిక్కర్ మరణం తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే.
- Advertisement -