- Advertisement -
పానాజి: అత్యాచారం కేసుపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బెనోలిమ్ బీచ్లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగింది. గురువారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీలో ఈ ఘటనపై మాట్లాడిని సిఎం.. ఆడపిల్లలకు అర్థరాత్రి బీచ్ లో ఏం పని అని ప్రశ్నించారు. అర్థరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా అని సిఎం నిలదీశారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే ఆ బాధ్యతను పోలీసులపై వదిలేయలేమన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సరికాదంటూ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం వ్యాఖ్యలు ఆడవాళ్లను అవమానించేలా ఉన్నాయని, వెంటనే సిఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Goa CM Comments on Gang Rape Case
- Advertisement -