Sunday, December 22, 2024

ఏ పార్టీ లోకి వెళ్లను …ఒంటరిగానే పోటీ చేస్తా : గోవా మాజీ సిఎం

- Advertisement -
- Advertisement -

 

పనాజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్రెమ్ స్థానం నుంచి ఒంటరిగా బరిలో దిగనున్నట్టు గోవా మాజీ సిఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రకటించారు. ఇటీవల బిజెపికి ఈయన గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. శనివారమే పార్టీకి రాజీనామా లేఖను పంపానని, అన్ని పదవులను విడిచిపెట్టానని వివరించారు. రాజీనామాకు ముందు వరకు ఆయన బిజెపి మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. తాను రాజీనామా చేశాక చాలా పార్టీలు సంప్రదించాయని, తాను ఒంటరి గానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News