Monday, January 20, 2025

కొడవటంచ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకున్న గోవా హవేలి ఎంఎల్‌ఏ

- Advertisement -
- Advertisement -

రేగొండ: మండలంలోని సుప్రసిద్ద కొడవటంచ లక్ష్మీ నరసింహాస్వామిని బిజెపి గోవా హవేలి నియోజకవర్గ ఎంఎల్‌ఏ ఉల్లాస్ తూయేకర్ బిజెపి రేగొండ మండల పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి వారితో దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ఎంఎల్‌ఏ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎంఎల్‌ఏ ఉల్లాస్ తూయేకర్ కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎంఎల్‌ఏ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి గూడెపల్లి గ్రామానికి చెందిన కార్యకర్త ఇంట్లో టీ తాగి ముఖ్య కార్యకర్తలను, మిర్చి పంట రైతులను కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం వలన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఫసల్ బీమాను అమలుపరిచినట్లయితే రైతులకు ఎంతో మేలు బీమాను అమలు పరిచినట్లయితే రైతులకు ఎంతో మేలు జరుగునని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి నరేంద్రమోడీకి మంచి పేరు వస్తుందని అక్కసుతోనే పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నాడని ఎంఎల్‌ఏ ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి, మండలాధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడునూతుల నిషిధర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి ప్రసాద్‌రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలసాని తిరుపతిరావు, జిల్లా ఉపాధ్యక్షులు కాంతాల సర్వోత్తమ్‌రెడ్డి, మండల నాయకులు సుదాటి వేణురావు, మండల ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు, బిజెపి సీనియర్ నాయకుడు వీరారావు, బిజెవైఎం జిల్లా నాయకుడు గుండెకారి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News