Wednesday, January 22, 2025

పార్టీలో సోనాలి ఫోగట్‌కు ‘బలవంతంగా’ తాగించారు, మెథాంఫెటమైన్ ఇచ్చారు: పోలీసులు

- Advertisement -
- Advertisement -

 

two more arrested

పానాజీ: బిజెపి నాయకురాలు సోనాలి ఫోగట్‌ మరణానికి కొన్ని గంటల ముందు ఆమె సహాయకులు మెథాంఫెటమైన్ అనే వినోద మందు ఇచ్చారని గోవా పోలీసులు శనివారం తెలిపారు. ఆమె  హత్యకు సంబంధించిన కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. శనివారం అరెస్టయిన వారిలో దత్తప్రసాద్ గాంకర్ ఫోగట్, ఆమె సహాయకులు సుధీర్ సగ్వాన్ , సుఖ్‌విందర్ సింగ్‌లకు డ్రగ్స్ అందించారని, వారు వాటిని ఆమెకు తినిపించారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన మరో వ్యక్తి ఎడ్విన్ నూన్స్.  ఉత్తర గోవా జిల్లాలోని కర్లీస్ రెస్టారెంట్ యజమాని.  అక్కడే ఆగస్ట్ 22, 23 మధ్య రాత్రి ఫోగాట్ , ఆమె సహాయకులు పార్టీ చేసుకున్నారు. వారు ఫోగాట్‌కు మెథాంఫెటమైన్ అనే ఒక రకమైన వినోద ఔషధం తినిపించారు. రెస్టారెంట్ వాష్‌రూమ్ నుండి కొంత మిగిలిపోయిన డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జీవ్బా దాల్వి తెలిపారు. మాజీ టిక్‌టాక్ స్టార్ , రియాలిటీ షో బిగ్ బాస్‌లో పోటీదారు అయిన ఫోగట్, గోవాకు వచ్చిన ఒక రోజు తర్వాత ఆగస్టు 23 న మరణించింది.

శవపరీక్ష నివేదిక ఆమె శరీరంపై అనేక “తీవ్ర గాయాలు” ఉన్నాయని చెప్పిన తర్వాత నిందితులిరద్దరిని అదుపులోకి తీసుకున్నారు.  హత్యకు సంబంధించిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారు. ఆమె హత్య వెనుక “ఆర్థిక ప్రయోజనాలే” కారణమని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కేసును సిబిఐకు అప్పజెప్పకపోతే కేసును తారుమారు చేసే అవకాశం ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News