- Advertisement -
పనాజి: గోవాలో తృణిమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లూయీజిన్హో ఫలీరో ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. తనకు కేటాయించిన స్థానంలో పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించారు. తనకు బదులుగా ఆ స్థానం నుంచి తమ పార్టీకి చెందిన ఓ యువతిని బరిలో దించుతున్నట్టు తెలిపారు. మహిళలకు సాధికారత కల్పించడంలో అది మా విధానమని ఆయన చెప్పారు. పార్టీ జాతీయాధ్యక్షురాలు మమతాబెనర్జీతో చర్చించిన తరువాతనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను ఒక స్థానం నుంచి పోటీ చేసి మొత్తం ఫోకస్ అక్కడే పెట్టడానికి బదులుగా ప్రత్యక్ష పోటీ నుంచి తప్పుకుని గోవాలో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న తను అభ్యర్థులందరి గెలుపు కోసం కృషి చేయడం మంచిదని భావించానని పేర్కొన్నారు.
- Advertisement -