Saturday, November 16, 2024

ఐటి రిక్రూటింగ్ పరిశ్రమలో పెను మార్పులే లక్ష్యం…

- Advertisement -
- Advertisement -

ఐటి రిక్రూటింగ్ పరిశ్రమలో పెను మార్పులే లక్ష్యం:  ఆప్టిమ్‌హైర్ వ్యవస్థాపకులు లక్ష్మి ఎం.కొడాలి


మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ ఆధారిత ఆప్టిమ్‌హైర్ గ్లోబల్ రిక్రూటింగ్ సంస్థ ఆప్టిమ్‌హైర్ 31 బిలియన్ డాలర్ల ఐటి రిక్రూటింగ్ పరిశ్రమకు పెనుమార్పులు చేయాలని లక్షంగా చేసుకుంది. ఎఐ, ఆటోమేషన్, క్రౌడింగ్ సోర్సింగ్, గిగ్ ఎకానమీని ఉపయోగించడం ద్వారా మార్పు తేవాలనుకుంటోంది. కంపెనీలు, అభ్యర్థులు, రెఫరల్ భాగస్వాముల ద్వారా ఆన్‌లైన్ విక్రయదారులు, అనుబంధ సంస్థలు, ప్రీలాన్స్ రిక్రూటర్లతో ఇవే ఎకో సిస్టమ్‌ను సంస్థ సృష్టించింది. తద్వార సగటు నియామక సమయాన్ని 6 నెలల నుంచి 12 రోజులకు తగ్గించింది. ఆప్టిమ్‌హైర్ వ్యవస్థాపకులు, సిఇఒ లక్ష్మి ఎం.కొడాలి మాట్లాడుతూ, ఐటి పరిశ్రమ విపరీతమైన వృద్ధిని సాధిస్తున్న సమయంలో రిక్రూట్‌మెంట్ పరిశ్రమలో భాగం కావడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. గ్లోబల్ కార్యకలాపాలను విస్తరించేందుకు రూ.150 కోట్లను సేకరించాలని లక్షంగా చేసుకున్నామని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News