Wednesday, January 22, 2025

ప్రాణం తీసిన మేక కన్ను

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుంగా ఓ వ్యక్తి మేక కన్ను మింగడంతో గొంతులో ఇరుక్కొని అతడు మృతి చెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సూరాజ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాయ్‌పూర్ 340 కిలో మీటర్లలో దూరంలో మదన్‌పూర్‌లో బగర్ సింగ్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. కొందరు స్నేహితులతో కలిసి ఖోపా డ్యామ్ టూర్‌కు వెళ్లారు. కొన్ని ప్రదేశాలు తిరిగిన తరువాత పార్టీ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం మేక తల మాంసాన్ని తీసుకున్నారు. తల కూర వండేటప్పుడు సగం ఉడికిన మేక కన్నును బగర్ సింగ్ నోట్లో వేసుకున్నాడు. అది గొంతులోకి జారిపోవడంతో ఊపిరాడక కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read: పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం: నిహారిక

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News