Thursday, January 23, 2025

చిరుత దాడిలో మేక మృతి..భయాందోళనలో గ్రామస్తులు

- Advertisement -
- Advertisement -

కాసిపేటః చిరుత పులి సంచారం మండల గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందిజ కాసిపేట మండలంలోని ముత్యంపల్లి అటవీ ప్రాంతం శివారు లో చిరుతపులి దాడిలో మేక మృతి చెందినట్లు ఫారెస్టు శాఖ డిప్యూటి రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్‌నాయక్ తెలిపారు. ముత్యంపల్లి అటవీ ప్రాంతంలో మేక మృతి చెందిన విషయాన్ని ఫారెస్టు శాఖ అధికారులకు తెలియజేయడంతో డిప్యూటి రేంజ్ అధికారి ప్రవీణ్‌నాయక్ శుక్రవారం అటవీ ప్రాంతం శివారులో మృతి చెందిన మేక ను పరీశీలించగా చిరుతపులి దాడి చేసినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేసారు. మేక తల లేకుండా పడి ఉండడంతో చిరుత పులి దాడిలోనే మేక మృతి చెంది ఉంటుందని ఆయన తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశంలో సిసి కెమోరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక ప్రాంతాల ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని.. వ్యవసాయ క్షేత్రాలకు కూడా ఒక్కరే వెళ్లకూడదని వివరించారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News