- Advertisement -
భోపాల్: మేకల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సిరోంజ్ జిల్లా కంకర్ ఖేడి లోయ గ్రామంలో జరిగింది. గ్రామస్థులు మేకలను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వంద మేకలతో లారీ శివ పురి నుంచి హైదరాబాద్‌కు వస్తంపడగా కంకర్‌ఖేడీ వద్ద లోయలో పడింది. గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని మేకలను పట్టుకొని పారిపోయారు. ట్రక్కు కింద చిక్కుకున్న సచిన్ కాటిక్ అనే వ్యక్తిని మాత్రం కాపాడకపోవడంతో అతడు చనిపోయాడు. మానవత్వం మరిచిపోవడంతోనే అతడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు వాపోతున్నారు.
- Advertisement -