Thursday, January 23, 2025

విద్యుదాఘాతంతో మేకల కాపరి మృతి

- Advertisement -
- Advertisement -

లింగాల: విద్యుద్దాఘాతానికి గురై మేకల కాపరి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని పాత రాయవరం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. కాట్రాజ్ మంతయ్య (మోతలు) (60) అనే వ్యక్తి మేకలను సాకుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఆ గ్రామ శివారులోని గువ్వ గుట్ట దగ్గర మేకలను కాసేందుకు వెళ్లాడు. గత కొంత కాలంగా అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు వరి పంట చుట్టూ కరెంట్‌ తీగలను అమర్చాడు.

ఇదే క్రమంలో ఆ మందలోని ఓ మేక ఆ తీగలు ఉన్న పంట పొలం వైపు వెళ్ళింది. దానిని తీసుకురావడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఆ విద్యుత్ తీగలు తగిలి మేకతో పాటు ఆ మేకల కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. పంట పొలాల్లో కరెంట్ షాక్ పెట్టడం వల్లనే రైతు చనిపోయాడని, లేకుంటే ఆ మేకల కాపరి చనిపోయేవాడు కాదని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News