Thursday, January 23, 2025

పిడుగు పడి మేకల కాపరి మృతి..

- Advertisement -
- Advertisement -

వెల్గటూర్: మండలం లో కురిసిన అకాల వర్షానికి పిడుగు పడి వ్యక్తి మృతి, మరోటోట కొబ్బరి చెట్టు పై పిడుగు పడింది. శనివారం మధ్యాహ్నం మండలం లోని జగదువుపేట లో పడిన పిడుగు పాటుకు మేకల కాపరి మృతి చెందగా,శాఖాపూర్‌లో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. జగదేవుపేటలో క్యాతం రాజయ్య (65) తన మేకలును మేపడం కోసం లోత్తునూర్ వైపుగల పోలాల్లోకి వేళ్లాడు.

మధ్యాహ్నాం కురిసిన అకాల వర్షానికి పడిన పిడుగుతో రాజయ్య అక్కడికక్కడే మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు . శాఖాపూర్ గ్రామం లో ని మిరాల తిరుపతి ఇంటి వద్ద గల కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. రోడ్డు పైన గల ఇల్లు కావడం తో ప్రక్కనున్న జనం వచ్చి చెట్టుపైన మండతున్న మంటను చూచి బయాందోళనకు గూరైయ్యారు . అకాల వర్షాం తో పాటు ఈదురు గాలులకు వెల్గటూర్ గ్రామం లో చెట్టు విరిగి పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News