Monday, December 23, 2024

ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్న గోబ్యాక్ ఫాసిస్టు మోడీ..

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: వివిధ మౌలిక సౌకర్యాల కల్పనా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు శనివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను, ఆ తర్వాత తమిళనాడును సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ట్విటర్‌లో గోబ్యాక్ ఫాసిస్టు మోడీ ట్రెండ్ అవుతోంది. వీటిలో అత్యధిక ట్వీట్లు తమిళనాడు నుంచి పోస్ట్ అవుతున్నాయి.

తమిళనాడులో అధికార డిఎంకె ప్రభుత్వానికి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలొకన్న నేపథ్యంలో ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన జరుగుతోంది. అదే విధంగా తెలంగాణలో సైతం బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రధాని మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అంకురార్పణ చేయడంతోపాటు సికింద్రాబాద్, తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు.
అనంతరం ఆయన సికింద్రాబాద్‌లోని పెరేడ్‌గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నమే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు బయల్దేరి వెళతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News