Monday, December 23, 2024

‘గాడ్ ఫాదర్’తో నయన్ కీలక సన్నివేశాలు

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో దర్శకుడు మోహన్ రాజాతో చేస్తున్న భారీ చిత్రం ‘గాడ్ ఫాధర్’ ఒకటి. మళయాళ బ్లాక్ బస్టర్ చిత్రం ‘లూసిఫర్’కి రీమేక్‌గా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ పిల్మ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా రూపొందిస్తున్నారు. ఈ మూవీ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో నయనతార పాల్గొంది. ఈ నేపథ్యంలో మోహన్ రాజా, నయనతార ఫొటోను షేర్ చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ “లేడీ సూపర్ స్టార్ నయనతారపై ఒక కీలక షెడ్యూల్ ని పూర్తి చేశాను. ఆమెతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది”అని తెలిపారు. ఇక ఈ భారీ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News