Wednesday, January 22, 2025

‘గాడ్ ఫాదర్’ వచ్చేది అప్పుడేనా?

- Advertisement -
- Advertisement -

God Father movie will be released

సమ్మర్ సీజన్ సినిమాల హడావిడి కొన్ని రోజుల్లో ముగియనుంది. ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, కెజిఎఫ్ 2, సర్కారు వారి పాట సినిమాలు వచ్చేశాయి. త్వరలో ఎఫ్ 3 సినిమా విడుదలకానుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ దృష్టి ఆగస్ట్‌పై పడింది. ఇప్పటికే మూడు సినిమాలు ఆగస్ట్ 12ని లాక్ చేసుకున్నాయి. అఖిల్ -, సురేందర్ రెడ్డిల ‘ఏజంట్’, నితిన్, రాజశేఖర్ రెడ్డిల ‘మాచర్ల నియోజక వర్గం’, సమంత ‘యశోద’… ఈ మూడు సినిమాలు కూడా ఆగస్ట్ 12న వస్తున్నాయి. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అదే డేట్ పై దృష్టి పెట్టారు. చిరంజీవి, మోహన్ రాజా కలయికలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చింది. ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆగస్ట్ 12న ‘గాడ్ ఫాదర్’ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఆగస్ట్ 12 స్పెషాలిటీ ఏమిటంటే.. ఇండిపెండెన్స్ డే పండుగ కలసిరావడమే దీనికి కారణం. శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా సెలవు దినం కావడం… అందులోనూ ఇండిపెండెన్స్ డే లాంటి స్పెషల్ హాలిడేని ఎవరూ వదులుకోరు. ‘గాడ్ ఫాదర్’ యూనిట్ ఆలోచన ఇదే. అయితే మెగాస్టార్ బరిలోకి దిగితే.. మిగితా మూడు సినిమాలు తప్పుకుంటాయా ? రేసులో నిలబడతాయా? అనేది ప్రశార్ధకంగా వుంది. ఆ మూడు సినిమాలు మంచి సినిమాలే కానీ చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లతో పోటీపడ దగ్గ సినిమాలు కావనే చెప్పాలి. కొంచెం తేడా జరిగినా నష్టపోయి ప్రమాదం వుంది. ఒకవేళ మెగాస్టార్ వస్తే కనుక ఈ మూడు సినిమాలు డ్రాప్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News