Monday, December 23, 2024

ధోనీ “గాడ్ ఆఫ్ చెన్నై”: రాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ ఉంటే చాలు ఆ అభిమానం ఆకాశం తాకుతుంది. ధోనీ ఇప్పటికే భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించడంతో పాటు చెన్నైసూపర్ కింగ్స్ జట్టుకు ఐదు ఐపిఎల్ టైటిళ్లు అందించాడు. ధోనీ మైదానంలోకి దిగడాంటే చాలు అభిమానానికి హద్దులు అనేవి ఉండవు. ఈ సందర్భంగా చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు మీడియాతో ముచ్చటించారు. తాము సిక్స్, ఫోర్ కొట్టినా అంతగా అభిమానుల నుంచి స్పందన కనిపించదు కానీ ధోనీ సిక్స్ కొట్టడంటే చాలు స్టేడియంలో హంగామా కనిపిస్తుందని రాయుడు తెలిపారు.

రవీంద్ర జడేజా ఫోర్, సిక్స్, వికెట్ తీసిన క్రికెట్ అభిమానుల నుంచి స్పందన అంతంత మాత్రమే ఉంటుందని వివరించారు. ధోనీ అభిమానులే సిఎస్‌కెకు అభిమానులు మారారని స్పష్టం చేశారు. గాడ్ ఆఫ్ చెన్నై అంటేనే ధోనీ అని, భవిష్యత్తులో అతడి కోసం తప్పకుండా గుడులు కడుతారని, మైదానంలో ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచే వ్యక్తి అతడు అని రాయుడు కొనియాడారు. అందుకే అతడిని కూల్ అని పిలుస్తారన్నారు. ఐపిఎల్ 2024లో ధోనీ చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తూ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ధోనీని చూసేందుకే ప్రేక్షకులు స్టేడియాలకు తరలి వస్తున్నారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News