Wednesday, January 22, 2025

రావణ సంహారానికి కదిలిన రాఘవుడు

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘ఆదిపురుష్’ నుంచి స్పెషల్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సీతమ్మను అపహరించిన రావణ సంహారం జరగాల్సిందేనని ప్రతిజ్ఞ చేసిన రాఘవుడు వానర సైన్యంతో కలిసి లంకపై దండెత్తిన అపూర్వ దృశ్యాన్ని గుర్తుచేసిందీ ఈ పోస్టర్. ఈ పోస్టర్‌లో రాముడిగా పోతపోసినట్లు ప్రభాస్ కనిపించారు. రణక్షేత్రం వైపు దృష్టి సారించే ఆ చూపులు, లక్ష్యం వైపు వడిగా పడే ఆ అడుగులు, శత్రువును చీల్చేందుకు సిద్ధమైన విల్లంబులతో రాముడి కార్యదీక్షను ప్రభాస్ తన ఆహార్యంలో అద్భుతంగా చూపించారు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆదిపురుష్’ నుంచి విడుదలైన ఈ లుక్ అభిమానులను అలరిస్తోంది. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంతో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంశీ, ప్రమోద్ నిర్మాతలు. కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్‌లో వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

ఇంకా చదవండి

‘ప్రిన్స్’కు అనూహ్య స్పందన

నవంబర్ 4న ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’

భారీ సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News