Monday, January 13, 2025

కొండా మురళి చేసిన పనులకు దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడు

- Advertisement -
- Advertisement -
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి

హైదరాబాద్ : కొండా మురళి చేసిన పనులకు దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. చేయని పనులకు బిల్లులను క్లెయిమ్ చేసిన మోసగాడు కొండా మురళి అని ఆరోపించారు. ఆయన అందరినీ తిట్టే రకం అని, సోనియాను, కెసిఆర్‌ను, జగన్‌ను ఇదివరకే తిట్టారని పేర్కొన్నారు. రేపు వంత్ రెడ్డిని కూడా తిడతారని విమర్శించారు. కొండా సురేఖ ,ఆమె బిడ్డ కూడా పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అసలు వాళ్ళ భాష ఏమిటీ..? అని ప్రశ్నించారు. వాళ్లు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

కొండా మురళి కుక్కలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాళ్లు ముందు భాష మార్చుకోవాలని, లేదంటే తాను నోరు తెరవాల్సి వస్తుందని హెచ్చరించారు. సిఎం కెసిఆర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తెలంగాణ సాధించారని, అందర్నీ అక్కున చేర్చుకోవాలని కెసిఆర్ భావించి కొండా దంపతులకు రాజకీయ భిక్ష పెట్టారని చెప్పారు. అయినా వాళ్లు ఆ గౌరవాన్ని నిలుపుకోలేకపోయారని తెలిపారు. అసలు వరంగల్ అభివృద్ధిలో కొండా మురళి పాత్ర ఏమిటి..? అని నిలదీశారు.

రాజకీయ పునర్జన్మ నిచ్చిన కెసిఆర్‌పై అవాకులు చవాకులా పేలుత్నురని మండిపడ్డారు. కెసిఆర్, కెటిఆర్‌లపై అనుచితంగా మాట్లాడితే ప్రజలే కొండా మురళిని ఉరికించి కొడతారని అన్నారు. కెసిఆర్, కెటిఆర్ కాలి గోటికి కూడా కొండా ఫామిలీ పనికి రాదని అన్నారు. కొండా మురళి ఏం చేసి అన్ని ఆస్తులు కూడబెట్టారని, కొండా మురళి తాను గుండా,హంతకుడినని ఒప్పుకుంటున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే పరకాలకు రా ..నా మీద పోటీ చేసి గెలువు అని ధర్మారెడ్డి సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News