Monday, December 23, 2024

1.5 మిలియన్ల వినియోగదారులతో 10వ వార్షికోత్సవాన్ని వేడుక చేస్తోన్న గో డాడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రోజువారీ వ్యాపారులకు సైతం సాధికారిత కల్పిస్తోన్న గో డాడీ ఇంక్‌ (ఎన్‌వైఎస్‌ఈ ః జీడీడీవై) నేడు భారతదేశంలో తమ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలో అతిపెద్ద డొమైన్‌ నేమ్‌ రిజిస్ట్రార్‌ ఈ మైలురాయిని వేడుక చేసుకుంటూ గత దశాబ్ద కాలంలో మూడు రెట్ల వృద్ధి, 1.5 మిలియన్ల మంది వినియోగదారులను భారతదేశంలో నమోదు చేసినట్లు వెల్లడించింది. ఈ వినియోగదారులలో స్వతంత్య్ర చిరు వ్యాపారులు, గో డాడీ భాగస్వాములు (ప్రొఫెషనల్స్‌+ రిసెల్లర్స్‌) ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్‌లకు పైగా వినియోగదారులు కలిగిన గోడాడీ, ప్రజలు తమ ఆలోచనకు పేరు పెట్టుకునే ప్రాంగణంగా నిలువడంతో పాటుగా ప్రొఫెషనల్‌ వెబ్‌సైట్స్‌ నిర్మించుకోవడం, వినియోగదారులను ఆకర్షించడం, తమ ఉత్పత్తులు మరియు సేవలను విక్రయించడం, తమ పనిని నిర్వహించడంలో సహాయపడుతుంది.

గో డాడీ భారతీయ మార్కెట్‌లోకి 2012లో 40 మంది కస్టమర్‌ కేర్‌ ఏజెంట్లతో కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటుగా రోజుకు 300–400 కాల్స్‌ను నిర్వహించే వారు. నేడు, గో డాడీకి 1000 మంది కస్టమర్‌ కేర్‌ ఏజెంట్లు ఉన్నారు, వీరు రోజుకు 3500 కాల్స్‌ను మరియు నెలకు 90వేలకు పైగా మెస్సేజ్‌లను నిర్వహిస్తున్నారు. గోడాడీ ఇప్పుడు తమ బహు భాషా ఇంటిగ్రేటెడ్‌ ఉత్పత్తి ఆఫరింగ్స్‌ను, కస్టమర్‌ కేర్‌ మద్దతును ఈ సాంస్కృతికం గా అత్యంత శక్తివంతమైన మార్కెట్‌లో అందిస్తుంది. ఆన్‌లైన్‌ స్వీకరణ గురించి అవగాహన కల్పించడానికి గోడాడీ ప్రయత్నిస్తుండటంతో పాటుగా హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో తమ జాతీయ మార్కెటింగ్‌ ప్రచారాల ద్వారా ఈ ప్రచారాలను చేస్తోంది. వీరిలో ఆరు ప్రాంతీయ భాషలు – తమిళం, మరాఠీ, తెలుగు,గుజరాతీ, కన్న, మలయాళం–లో సైతం ప్రచారం చేస్తోంది. దీనితో పాటుగా హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, ఆంగ్లం వంటి ఐదు భాషలలో సైతం కస్టమర్‌ కేర్‌ ఆఫరింగ్‌ అందిస్తుంది.

గత దశాబ్ద కాలంలో గోడాడీ, భారతదేశానికి ప్రత్యేకంగా ఉత్పత్తి ఆఫరింగ్‌ అయినటువంటి ఆన్‌లైన్‌ స్టార్టర్‌ బండిల్‌ అందిస్తుంది. ఇది ఆల్‌ ఇన్‌ ఒన్‌ ఇంటర్నెట్‌ పరిష్కారం. ఇది భారతదేశానికి సంబంధించి ప్రత్యేకమైన డొమైన్‌ పేరు (డాట్‌ ఇన్‌ మరియు డాట్‌ కో డాట్‌ ఇన్‌) అందిస్తుంది. ఒక్క పేజీ వెబ్‌సైట్‌ మరియు సెక్యూరిటీ ప్రొఫెషనల్‌ ఈ–మెయిల్‌ ఖాతాను వినియోగించవచ్చు. గోడాడీ ఇప్పుడు వెబ్‌సైట్స్‌+ మార్కెటింగ్‌ సైతం అందిస్తుంది. దీనిలో వెబ్‌సైట్‌ బిల్డర్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ టూల్స్‌ మరియు ఆన్‌లైన్‌ స్టోర్‌ మిళితమై ఉంటాయి. మరింత విలాసవంతమైన డిజిటల్‌ ఉనికి కోసం గోడాడీ ఇప్పుడు వర్డ్‌ ప్రెస్‌, వీపీఎస్‌, డెడికేటెడ్‌ సర్వర్లను సైతం అందిస్తుంది. వీటన్నింటికీ 24 గంటల కస్టమర్‌ కేర్‌ మద్దతు సైతం ఉండి వారి ప్రయాణంలో తగిన మద్దతు సైతం అందిస్తుంది.

‘‘భారతదేశంలో గోడాడీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల అభినందనలు తెలుపుతున్నాం’’ అని నిక్సీ సీఈఓ అనిల్‌ జైన్‌ అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ భారతీయ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి కథకు పునాదిగా భావించే రోజువారీ వ్యాపారులు, చిరు వ్యాపార సంస్ధలకు తగిన సాధికారిత కల్పించాలనే లక్ష్యంతో గోడాడీ ముందుకు వెళ్తుంది. భారతదేశంలో వ్యాపార సంస్థల నడుమ ఇంటర్నెట్‌ స్వీకరణ పరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇక్కడ డిజిటల్‌ మార్కెట్‌ ప్లేస్‌ వృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని నిక్సీ వద్ద మేము చిరరు వ్యాపారులు, స్టార్టప్స్‌ దేశంలో ఆన్‌లైన్‌లో వృద్ధి చెందేందుకు సంపూర్ణమైన సహకారం అందిస్తున్నాము. ఈ దిశగా గోడాడీతో మా భాగస్వామ్యం మరింత ప్రత్యేకంగా నిలిచింది. భారతీయ చిరు వ్యాపార యజమానులు మరియు వ్యాపారవేత్తలను ప్రోత్సహించాలనే వారి లక్ష్యం ఇది ప్రతిధ్వనించడంతో పాటుగా సరైన ఉపకరణాలు, సేవలతో డిజిటల్‌ ఉనికిని సృష్టిస్తున్నాము. భారతీయ వ్యాపారవేత్తలకు మద్దతునందించడానికి గో డాడీతో కలిసి పనిచేయడానికి మరిన్ని అవకాశాలను చూస్తున్నాము’’ అని ఆయన అన్నారు

తమ 10 వ వార్షికోత్సవం, భారతదేశంలో గోడాడీ కార్యకలాపాలను గురించి గోడాడీ వీపీ మరియు ఎండీ – ఇండియా నిఖిల్‌ అరోరా మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో దాదాపు 63 మిలియన్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్ధలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశంలో సామాజిక–ఆర్ధిక అభివృద్ధికి ఇవి అతి పెద్ద తోడ్పాటుదారునిగా నిలుస్తున్నాయి. ఓ దశాబ్ద కాల మా ప్రయాణం తరచి చూస్తే, డిజిటల్‌గా వ్యాపార సంస్ధలకు తగిన సాధికారిత అందించేందుకు తోడ్పడటం పట్ల ఆనందంగా ఉన్నాము. నేడు, నిక్సీ వెల్లడించే దాని ప్రకారం, గోడాడీ ఇప్పుడు నెంబర్‌ 1 మార్కెట్‌ వాటాను డాట్‌ ఇన్‌ డొమైన్‌ పేర్ల నమోదు పరంగా 45% వాటా సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా, వోకల్‌ ఫర్‌ లోకల్‌ మిషన్స్‌కు అనుగుణంగా చిరు, మధ్య తరహా వ్యాపార సంస్ధలు తమ ఉత్పత్తులు,సేవలను వృద్ధి చేసుకునేలా తోడ్పడటం కొనసాగించడంతో పాటుగా ఆన్‌లైన్‌లో వారు ఉనికిని చాటడం ద్వారా ప్రయోజనం పొందేందుకు సైతం సహాయపడుతూ తగన మార్గనిర్ధేశకత్వం చేయనున్నాము’’ అని అన్నారు.

భారతదేశంలో సూక్ష్మ, చిరు, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖకు తగిన మద్దతును గోడాడీ అందిస్తుంది. వ్యాపార సంస్థలకు సౌకర్యవంతంగా మద్దతునందించాలన్న లక్ష్యంతో గోడాడీ ఇటీవలనే తమ మొట్టమొదటి డాటా సెంటర్‌ను ఇండియాలో తెరిచింది. తద్వారా వనరులు అందుబాటులో ఉంచడంతో పాటుగా 40% అధికంగా సర్వర్‌ రెస్పాన్స్‌ సమయం వృద్ధి చేయడంలో సహాయపడుతుంది. తద్వారా వినియోగదారుల అనుభవాలను మెరుగుపరుస్తుంది. దీనితో పాటుగా సెక్యూరిటీ ప్రొటెక్షన్‌ సైతం మెరుగుపరుస్తుంది. లోకల్‌ డాటా సెంటర్‌ను కలిగి ఉండటం వల్ల వెబ్‌సైట్ల లోడింగ్‌ సమయం మెరుగుపడటం సహాయపడటంతో పాటుగా సెర్చ్‌ ర్యాకింగ్‌ ఫలితాలు సానుకూలంగా మెరుగుపడేందుకు సైతం తోడ్పడుతుంది.

భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంకు మద్దతునందించే దిశగా గోడాడీ తాము చేసే ప్రతి కార్యక్రమాన్ని చిరు వ్యాపార యజమానులు లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తుంది. డిజిటల్‌గా వారు తగిన సాధికారిత సాధించేందుకు తగిన శి క్షణ అందిండం వల్ల, భారతీయ చిరు వ్యాపార యజమానులు మరింతగా తమ వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి సైతం సహాయపడుతుంది.

గోడాడీ బ్రాండ్‌ మరియు ఆఫరింగ్స్‌ చుట్టూ అవగాహన పెంచడంలో సహాయపడేందుకు గోడాడీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)కు అధికారిక స్పాన్సర్‌గా ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2019కు వ్యవహరించింది. ప్రపంచంలో అతిపెద్ద స్పోర్టింగ్‌ ఈవెంట్స్‌లో ఒకటి ఇది. అలాగే డిసెంబర్‌ 2017లో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం గోడాడీ స్పాన్సర్‌ చేసింది. అలాగే నవంబర్‌/డిసెంబర్‌ 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన హోమ్‌ సిరీస్‌లో భాగంగా 5 టెస్ట్‌ మ్యాచ్‌లకు స్పాన్సర్‌ చేసింది. క్రికెట్‌తో పాటుగా గోడాడీ ఇప్పుడు పలు జాతీయ మరియు అంతర్జాతీయ సంస్ధలతో భాగస్వామ్యం చేసుకుని పలు క్రీడలను అంతర్జాతీయంగా ప్రచారం చేస్తోంది. దీనిలో బాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌(బీఎస్‌ఎఫ్‌)తో గోడాడీ యొక్క సుదీర్ఘ భాగస్వామ్యం సైతం ఉంది. టోటల్‌ బీడబ్ల్యుఎఫ్‌ థామస్‌ ఉబర్‌ కప్‌, టోటల్‌ బీడబ్ల్యుఎఫ్‌ వరల్డ్‌ చాంఫియన్‌షిప్స్‌ మరియు మరెన్నో కార్యక్రమాలకు అధికారిక భాగస్వామిగా నిలిచింది. ఢిల్లీ ఉమెన్స్‌ రగ్బీ టీమ్‌తో గోడాడీ యొక్క భాగస్వామ్యాన్ని నూతన అవకాశాలు మరియు యువతులకు స్ఫూర్తి కలిగించే రీతిలో తీర్చిదిద్దారు.

చిరు వ్యాపారాలకు అవగాహన కల్పించేందుకు వీలుగా విషయ పరిజ్ఞానంతో కూడిన ప్రచారాలను చేసే తమ వారసత్వం కొనసాగించడానికి గోడాడీ, ఎంఎస్‌ధోనీతో భాగస్వామ్యం చేసుకుని ఇండియా మార్కెటింగ్‌ ప్రచారం నిర్వహించింది.ఈ క్రికెటర్‌ బిజ్నెస్‌ భాయ్‌ క్యారెక్టర్‌ను పోషించడంతో పాటుగా బిజినెస్‌ మెంటార్‌గా సహాయపడుతుంటాడు. చిరు వ్యాపార యజమానులకు మార్గనిర్దేశకత్వం చేయడంతో పాటుగా ఆన్‌లైన్‌లో ఉనికిని చాటడం ద్వారా మరింత మంది వినియోగదారులను చేరుకోవచ్చని మరియు వారి వెంచర్లు విజయవంతంగా వృద్ధి చేయవచ్చని వెల్లడిస్తారు. గోడాడీ యొక్క తాజా మార్కెటింగ్‌ ప్రచారం ప్రధానంగా ఆన్‌లైన్‌లో తమ వ్యాపారాలకు ప్రపంచవ్యాప్తంగా పరిమాణం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రచారం కల్పించవచ్చని వెల్లడిస్తుంది. ఈ ప్రచారం ద్వారా మరింత మంది మహిళా వ్యాపారవేత్తలకు సాధికారితను కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరు ఆన్‌లైన్‌లో వెళ్లడం ద్వారా మరిన్ని అవకాశాలను సృష్టించుకోవచ్చని వెల్లడిస్తున్నారు.

గోడాడీ ఇప్పుడు పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ రిజిస్ట్రీ (పీఐఆర్‌)తో భాగస్వామ్యం చేసుకుని తమ డిజిటల్‌ వీడియో ప్రచారాన్ని భారతదేశంలో ఫేసెస్‌ బిహైండ్‌ ఛేంజ్‌ శీర్షికన ప్రారంభించింది. దీనిద్వారా భారతదేశంలో డాట్‌ ఓఆర్‌జీ డొమైన్‌ పేర్ల స్వీకరణను ప్రోత్సహిస్తోంది. ఈ ప్రచారం ద్వారా గోడాడీ పలు సుప్రసిద్ధ లాభాపేక్ష లేని సంస్థల గురించి అవగాహన కల్పించడంతో పాటుగా మద్దతును అందిస్తుంది. వీటిలో కిరన్‌ బేదీ యొక్క ఇండియా విజన్‌ ఫౌండేషన్‌; భారతీయ సంగీత ద్వయం సలీమ్‌ మరియు సులైమాన్‌ మర్చంట్‌ యొక్క జరియా ఫౌండేషన్‌ మరియు భారతీయ నటుడు, సామాజిక ఉద్యమకారుడు రాహుల్‌ బోస్‌ యొక్క హీల్‌ వంటివి ఉన్నాయి.

గత సంవత్సరం కొవిడ్‌ మహమ్మారి ఉన్నప్పటికీ గోడాడీ తమ మొట్టమొదటి వర్ట్యువల్‌ ఈవెంట్‌ను భారతదేశంలో ప్రారంభించింది. డిజిటైజ్డ్‌ భారత్‌ ఈ –కాంక్లేవ్‌ 2021 శీర్షికన నిర్వహించిన ఈ సదస్సు ద్వారా చిరు వ్యాపార యజమానులు, వ్యాపార వేత్తలకు మద్దతునందించడంతో పాటుగా నూతన సాధారణ నిర్వహణ వాతావరణంలో వ్యాపార కొనసాగింపుకు సహాయపడుతుంది. మార్గనిర్దేశకత్వం అందించడంతో పాటుగా డిజిటల్‌ వ్యాపారాలను ప్రారంభించి, ఎదుగుతున్న వారికి తగిన సూచనలను అందిస్తుంది. గోడాడీ యొక్క ఉపబ్రాండ్‌ గోడాడీ ప్రో సైతం ఎక్స్‌పాండ్‌ 2021 సదస్సును భావితరపు భారతీయ వెబ్‌ డిజైనర్లు మరియు డెవలపర్లును తీర్చిదిద్దేందుకు ప్రారంభించింది.

గోడాడీ ఇప్పుడు సమగ్రమైన రీతిలో ఆన్‌లైన్‌ ఉత్పత్తులను అందిస్తుంది. వీటిలో డొమైన్‌ పేర్లు, హోస్టింగ్‌, వెబ్‌సైట్‌ బిల్డింగ్‌, ఈ–మెయిల్‌ మార్కెటింగ్‌, సెక్యూరిటీ ప్రొటెక్షన్స్‌ మరియు ఆన్‌లైన్‌ స్టోర్‌ తో పాటుగా స్ధానిక మరియు ప్రాంతీయ భాషల్లో 24గంటల కస్టమర్‌ మద్దతు, తమ వెంచర్‌ వృద్ధి చేసుకునేలా వినియోగదారులకు సహాయపడటం మరియు వారి అవసరాలకు అత్యుత్తమంగా సహాయపడేలా ఉపకరణాలను కనుగొనడం వంటివి ఉన్నాయి.

Godaddy Celebrates its 10th Anniversary

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News