Monday, January 6, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి గోదారి గట్టు సాంగ్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

సీనియర్ హీరో వెంకటేశ్, యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం‘సంక్రాంతికి వస్తున్నాం’. ఫ్యామిలీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, సిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్యగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.

‘గోదారి గట్టు మీద రామసిలకవే.. ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే..’ అంటూ సాగే ఈ పాటను సీనియర్ సంగీత ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ గోగుల, సింగ‌ర్ మ‌ధుప్రియ క‌లిసి పాడారు. భాస్కరభట్ల లిరిక్స్ అందించ‌గా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు. ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ బాగా ఆకట్టుకుంటోంది. కాగా, సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రి 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News