Monday, December 23, 2024

గోదావరి బోర్డు సమావేశం వాయిదా

- Advertisement -
- Advertisement -

Godavari board meeting adjourned

హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదాపడింది. ఆంధ్రప్రదేశ్ సభ్యుల ఉద్దేశ పూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. బోర్డు చైర్మన్ ఎంపి సింగ్ అధ్యక్షతన జరగాల్సిన ఈ భేటీకి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశాపాండే, ఇంజినీర్లు హాజరయ్యారు. ఎపికి చెందిన ఒక్క అధికారి కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో బోర్డు ఈ సమావేశాన్ని వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ సభ్యుల గైర్హాజరుతో మార్చి 11న కూడా భేటీ వాయిదా పడింది. ఎపి సభ్యులు కావాలనే సమావేశానికి రాలేదని రజత్‌కుమార్ అన్నారు.

వరుసగా రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వారు హాజరుకాలేదని చెప్పారు. తెలంగాణకు సంబంధించిన మూడు ప్రాజెక్టుల డిపిఆర్‌లకు బోర్డు ఆమోదం తెలపాలని వెల్లడించారు. ఎపి సభ్యులు రాకపోవడంతో అనుమతులకు ఆలస్యమవుతోందని చెప్పారు. సీతమ్మసాగర్, తుపాకులగూడెంకు హైడ్రాలాజికల్ అనుమతి వచ్చిందన్నారు. ఆరు నెలల్లోపు అన్ని ప్రాజెక్టులకు అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై కేంద్రం ఇంకా ట్రైబ్యునల్‌కు నివేదించడం లేదన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన ఈఎన్‌సి వెంకటేశ్వర్లు, సిఇ మధుసూదన్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌కుమార్, కోటేశ్వరరావు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News