Friday, November 22, 2024

ప్రాజెక్టులను మేం అప్పగిస్తేనే తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

Godavari Board to Takeover Peddavagu from Telangana

బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను చేర్చుకోవడంపై స్పష్టం చేసిన రజత్ కుమార్

గోదావరి బోర్డుకు పెద్దవాగు

గోదావరి బోర్డు పరిధిలోకి పెద్దవాగు సీడ్‌మనీ దేనికోసమో స్పష్టత కావాలి రాష్ట్ర నిర్వహణ బోర్డుకు పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే గెజిట్ అమలు వాయిదా వేయాలని కోరిన తెలంగాణ బోర్డుకు

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఈనెల 14నుంచి అమల్లోకి తేనున్న గెజిట్ నోటిఫికేషన్‌కు ముందస్తు కసరత్తుల్లో భాగంగా సోమవారం నాడు గోదావరి నదీయాజమాన్య బోర్డు నిర్వహించిన ప్రత్యేక సమావేశం ప్రశాంతగా ముగిసింది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్ నన్నద్ధతపై చర్చించారు. గెజిట్ నోటిఫికేషన్ అమలును మరికొంత కాలం వాయిదా వేయాలని సమావేశంలో తెలంగాణ రాష్ట్రం అధికారులు గట్టిగానే వాదించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి చేయాల్సిన పనులు ఇంకా చాల ఉన్నాయని, ఈ నేపధ్యంలో గెజిట్ అమలుకు సంబంధించి ప్రాజెక్టులను బోర్డులోకి తేవటం కుదరదని తెల్చిచేప్పారు. గెజిట్ నోటిఫికేషన్‌లో హాండవర్ అని మాత్రమే ఉందని తెలంగాణ అధికారులు బోర్డు చైర్మన్ దృష్టికి తెచ్చారు. పలు అంశాలపై జరిగిన పరిశీలనలు, చర్చల తర్వాత గోదావరి నది పరివాహంగా తెలుగు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులను బోర్ఢుపరిధిలోకి తెచ్చే అంశంలో ఎట్టకేలకు రెండు రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి రాగలిగాయి.

కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని గుమ్మడవళ్లి గ్రామం సమీపాన పెద్దవాగుపైన 1981లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకింద నిర్మించిన పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే గోదావరి బోర్డు పరిధిలొకి చేర్చేందుకు రెండు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 16వేల ఎకరాల ఆయకట్టు ఉండగా రాష్ట్ర విభజన అనంతరం అందులో తెలంగాణ రాష్ట్రం పరిధిలో 15శాతం ఆయకట్టు చేరగా, మిగిలిన 85శాతం ఆయకట్టు ఎపి పరిధిలొకి చేరిపోయింది.దీంతో గోదావరి బేసిన్ పరిధిలో పెద్దవాగు ప్రాజెక్టు రెండు రాష్టాల ఉమ్మడి ప్రాజెక్టుగా మిగిలింది. ప్రాజెక్టు హెడ్‌వర్క్ రిజర్వాయర్ ప్రాంతం తెలంగాణ పరిధిలోనే ఉన్నందున ఈ ప్రాజెక్టు నిర్వహణను ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రమే చూస్తోంది. ఈ ప్రాజెక్టును మాత్రమే గోదావరి బోర్డుకు అప్పగించి ప్రయోగాత్మకంగా దీని నిర్వహణ తీరును సమగ్రంగా అధ్యయనం చేసేందుకు బోర్డు ప్రతిపాదించింది. సమగ్ర అధ్యయనం ద్వారా వచ్చిన ఫలితాలను బట్టి ఆ తర్వాత బోర్డు పరిధిలోకి చేరే ప్రాజెక్టులపట్ల నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ప్రాజెక్టు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఏటా సుమారు రూ.30లక్షలు ఖర్చు చేస్తోంది.

సీడ్‌మనిగా రూ.200కోట్లపై చర్చ:

గోదావరి యాజమాన్య బోర్డు నిర్వహణకు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రూ.200కోట్లు సీడ్‌మనిగా బోర్డుకు అందచేయాలన్న అంశంపై కూడా సమావేశంలో కీలక చర్చ నడిచింది. బోర్డు నిర్వహణకు అంత ఖర్చు ఎందుకు అవుతుందో తెలపాలని రెండు రాష్ట్రాల అధికారులు బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ను కోరారు. సీడ్‌మని కింద ఎంత అవసరం, వేటికి ఎంత నిధులు వినియోగిస్తారు ,అందుకు సంబంధించిన వివరాలను స్పష్టం చేయాలని కోరారు. ఆయితే అంత సమగ్రంగా ఇప్పటికిప్పుడు తెలపలేమని వివరాలను లేఖ ద్వారా తెలియపరుస్తామని బోర్డు చైర్మన్ సీడ్‌మని అంశానికి అంతటితో తెరదించే ప్రయత్నం చేశారు.

రెండు రాష్ట్రాల అధికారులతోనే పాజెక్టుల నిర్వహణ:

కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రకటించిన ప్రాజెక్టుల నిర్వహణ ప్రస్తుతానికి యధాతధంగానే కొనసాగించాలన్న ప్రతిపాదనలకు సుముఖత వ్యక్తమైంది. ఏ రాష్ట్రం పరిధిలో ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను ఆ రాష్ట్రానికి చెందిన అధికారులతోనే నడిపించేలా ఒక అవగాహనకు రాగలిగారు. బోర్డు కోరిన విధంగా సమాచారం అందచేసేందకు కూడా అంగీకారం తెలిపారు. గోదావరి బేసిన్ పరిధికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టులపైన పర్యవేక్షణ బాధ్యతలకు మాత్రమే బోర్డు పరిమితం కావాలన్న అంశంపై కూడా సుముఖత వ్యక్తమైనట్టు సమాచారం . గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ , ఈఎన్సీ మురళీధర్‌తోపాటు మరింకొందరు అధికారులు పాల్గొన్నారు. ఆంధప్రదేశ్ నుంచి నీటిపారుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, సిఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేం అప్పగిస్తేనే బోర్డు తీసుకోవాలి: రజత్ కుమార్

గోదావరి నదీయాజమాన్య బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తాము అప్పగిస్తే తప్ప టేకోవర్ చేసుకునేందుకు వీలు లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ తేల్చిచెప్పారు. గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశం ముగిసిన అనంతరం రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 14నుంచి అమలు కావాల్సిన గెటిజ్‌నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలిని బోర్డును కోరినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ఇటీవల ఢిల్లీలో ఇదే అంశాన్ని కేంద్రానికి తెలిపారన్నారు. ప్రాజెక్టులను ఇంకా అధ్యయనం చేయాల్సి వుందని ,హడావుడి అవసరం లేదన్నారు. ప్రాజెక్టులను రాష్ట్రాలు బోర్డుకు అప్పగించాలని మాత్రమే గెజిట్‌లో ఉందని , రాష్ట్రం అప్పగిస్తే తప్ప బోర్డు వాటిని టేకోవర్ చేయటం కుదరదని తెలిపారు. పెద్దవాగు ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అప్పగించాలని బోర్డు కోరిందని ,ఎపి నుంచి కూడా దీనిపై అభ్యంతరం రాలేదన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే పెద్దవాగు ప్రాజెక్టుపై అప్పగింతకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ , ప్లడ్ మేనేజ్‌మెంట్ ఎవిధంగా చేయాలన్నదానిపై చర్చించామన్నారు.

ప్రాజెక్టులకు సంబంధించి సిబ్బంది ఎవరికంట్రోల్‌లో వారే పనిచేస్తారని తెలిపారు. సీడ్‌మని విషయంలో స్పష్టత కావాలని కోరామని తెలిపారు.200కోట్లు అంటే చాల ఎక్కవ అన్నారు. సీడ్‌మని విషయంలో లేఖ ఇవ్వమని చైర్మన్ సూచించారన్నారు. గోదావరి బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఒకే సారి బోర్డుపరిధిలోకి తీసుకోవాలని ఎపి అధికారులు కోరారని తెలిపారు. ఎపి దిగువ రాష్ట్రం అయినందువల్ల లోయర్ రైపేరియన్ రైట్స్‌ను దృష్టిలో ఉంచుకోని ఆ రాష్ట్ర ప్రాజెక్టులను చేర్చాల్సిన అవసరం లేదని ఎపి తెలిపిందన్నారు. సీలేరు విద్యుత్ వాటా అడిగామని , ఆ రాష్ట్రం నుంచి సరిగా విద్యుత్ వాటా రావటం లేదన్న విషయాన్ని బోర్డు దృష్టికి తెచ్చామన్నారు. సీలేరు ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి చేర్చాలని కోరామన్నారు. నీటి సమస్యలు లేనందున సీలేరును బోర్డు పరిధిలొకి చేర్చాల్సిన అవసరం లేదని బోర్డు చైర్మన్ తెలిపారని స్పెషల్ సిఎస్ రజత్‌కుమార్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News