Sunday, December 22, 2024

వీడని ‘విపత్తు’

- Advertisement -
- Advertisement -

ఇంకా వరదలోనే గోదావరి తీరం

మళ్లీ పెరుగుతున్న
నీటిమట్టం
భద్రాచలం వద్ద ప్రమాదస్థాయి
ఎగువనే ప్రవాహం
ముంచుకొస్తున్న అల్పపీడనం
రాగల 3రోజులు భారీ వర్షాలు
అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
శ్రీరాంసాగర్‌కు ఆగని వరద పోటు
అన్నదాతల ఆందోళన

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి విపత్తులు తెలంగాణను ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. భారీ వర్షసూచనలతో వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు, ఈ నెలాఖరు వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందేని ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన ప్రకటనలు గోదావరి తీర ప్రాంత ప్రజలను మరింత జాగృతం చేశాయి. వర్షం కాస్త తెరిపిస్తున్నప్పటికీ గోదావరి నదీతీర ప్రాంతాల ప్రజలు వరద నీటిలోనే అష్టకష్టాలు పడుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో ప్రమాద హెచ్చరిక స్థాయికి మిం చి 13అడుగులపైనే వరద ఉధృతి తీవ్ర ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గోదావరిలో నీటిమట్టాన్ని బట్టి 43అడుగుల వద్ద మొదటి ప్రమాదక హెచ్చిరికను జారీ చేసి ఇప్పటికే వారం రోజు లు కావస్తొంది. నీటిమట్టం 48అడుగుల వద్దకు చేరగానే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం 53 అడుగుల వద్దకు చేరగానే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయాల్సివుండగా అధికారులకు ఆ అవకాశం ఇవ్వకుండానే గోదావరి మహోగ్రరూపం దాలుస్తూ వచ్చింది.

సోమవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి 13అడుగుల ఎత్తులోనే వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం పూర్తిగా తగ్గి గోదావరి సాధారణ పరిస్థితిని చేరుకునేందుకు మరో రెండు రోజలు పట్టే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అధికారులు చెబుతున్నారు. అదికూడా ఎగువన పరివాహక ప్రాంతాలో వర్షం పూర్తిగా ఆగితేనే గోదావరి శాంతించినట్టుగా భావించాలని సూచిస్తున్నారు. భద్రాచలం ఎగువన గోదావరి నదిలో వరద ప్రవాహం ఇంకా భారీగానే ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మహారాష్ట్ర నుంచి 95,750 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులో ఇప్పటికే నీటిమట్టం గరిష్టస్థాయికి మూడుఅడుగులు తక్కువగా ఉంది.

నీటి నిలువను 77.38 టీఎంసీల వద్ద నియంత్రించి ఎగువ నుంచి వస్తున్న నీటిని వస్తున్నట్టుగా దిగువన నదిలోకి వదిలిపెడుతున్నారు. కడెం నదిలో 16,974 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ముందు జాగ్రత్తగా కడెం ప్రాజెక్టును సగానికి ఖాళీ చేసిన అధికారులు నీటినిల్వను 3.49 టిఎంసీలకు పరిమితం చేశారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని యధావిధిగా దిగువకు వదులు తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 69,487 క్యూసెక్కుల నీరు చేరుతుండగా వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. గోదావరికి ప్రధాన ఉపనదిగా ఉన్న ప్రాణహిత నదిలో వదర ఉధృతి తగ్గటం లేదు.

మళ్లీ పెరిగుతున్న నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరినదిలో నీటిమట్టం సోమవారం రాత్రి నుంచి మళ్లీ పెరుగుతూ వస్తోంది. సాయంత్రానికి 56 అడుగుల చేరిన నీటిమట్టం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. 56.20అడుగులకు చేరుకుంది. అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద తీవ్రత పూర్తిగా తగ్గేదాక ఏమాత్రం ఏమరపాటుగా ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. గోదావరిలో వరద నీటి ప్రవాహం 16లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. నదికి ఇరువైపులా ఉన్న సమీప గ్రామాలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. కనీసం మరో మూడు అడుగులైనా తగ్గితే తప్ప మూడవ ప్రమాదహెచ్చరికను ఉపసంహరించే అవకాశం లేదు .అందుకు మరో 24గంటల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. మంగళవారం ఉదయానికి గోదావరి వదర ప్రమాదంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఏపిలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో 23లక్షల క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మూడవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News